‘పుష్ప’రాజ్ విజువల్‌గా కనిపించబోతున్నాడు..
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ ఊరమాస్ గెటప్‌లో దర్శనమివ్వనున్న చిత్రం ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో బన్నీ ఎర్రచందనం దుంగల స్మగ్లర్‌గా కనిపించబోతున్నారు. బన్నీ పాత్ర పేరే పుష్పరాజ్. ఈ పాన్ ఇండియా మూవీని వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలతో పవర్ ప్యాక్డ్ ప్రొడక్షన్ హౌస్‌గా టాలీవుడ్‌లో పేరుగాంచిన మైత్రీ మూవీ మేకర్స్ మరో నిర్మాణ సంస్థ ముత్తంశెట్టి మీడియాతో కలిసి నిర్మిస్తోంది. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం బన్నీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నిజానికి ఇప్పటి వరకూ ఫస్ట్‌లుక్, రిలీజ్ డేట్ పోస్టర్లు మినహా.. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్‌నూ చిత్రబృందం ఇప్పటివరకూ విడుదల చేయలేదు. దీంతో సినిమా అప్‌డేట్ ఎప్పుడు విడుదల చేస్తారా? అనే కుతూహలం అభిమానుల్లో మరింత ఎక్కువైంది. తాజాగా చిత్ర యూనిట్ ఓ అప్‌డేట్‌ను ఇచ్చింది. మరికొన్ని రోజుల్లో అంటే ఈ నెల 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఓ అదిరిపోయే అప్‌డేట్‌ను వదిలేందుకు చిత్రబృందం సిద్ధమవుతున్నట్టు అధికారికంగా వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను సైతం చిత్రబృందం విడుదల చేసింది.
బన్నీ పుట్టినరోజుకు ఒకరోజు ముందే ఈ అప్‌డేట్ విడుదల కానుంది. ఏప్రిల్ 7న సాయంత్రం 6.12 గంటలకు పుష్పరాజ్‌ను విజువల్‌గా పరిచయం చేయనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. జాతీయ అవార్డు గ్రహీత, మళయాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ పుష్పలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక నటిస్తోంది. ఈ పాన్ ఇండియా మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. బన్నీ-సుక్కు కాంటోలో రాబోతున్న ఈ మూడవ చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ చిత్రం ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments