డేట్ ఫిక్స్ చేసుకున్న ‘పుష్ప’..
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ ఏడాది 'అల వైకుంఠపురములో' సినిమాతో నాన్ 'బాహుబలి' రికార్డులు క్రియేట్ చేసిన బన్నీ.. సుకుమార్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీగా ‘పుష్ప’ను అనౌన్స్ చేయగానే కోవిడ్ ప్రభావం స్టార్ట్ అయ్యింది. సెట్స్ మీదకు వెళ్లడానికే ఆరేడు నెలలు పట్టింది. తీరా ‘పుష్ప’ షూటింగ్ రాజమండ్రి సమీపంలోని అటవీ ప్రాంతం మారేడు మిల్లిలో స్టార్ట్ చేశారు. అయితే సినిమా షూటింగ్‌కు కరోనా ఎఫెక్ట్ తగిలింది. దీంతో షూటింగ్‌ను ఆపేసిన యూనిట్ హైదరాబాద్ చేరుకున్నారు. రీసెంట్‌గానే బన్నీ, సుకుమార్ అండ్ టీమ్ మళ్లీ మారేడు మిల్లి ప్రాంతంలో షూటింగ్ స్టార్ట్ చేస్తారని వార్తలు వినిపించాయి. లేటెస్ట్ సమాచారం మేరకు జనవరి 8 నుండి బన్నీ ‘పుష్ప’ సినిమా మళ్లీ పునః ప్రారంభం అవుతుందని అంటున్నారు.
ఈసారి మరింత కట్టుదిట్టంగా.. తగు జాగ్రత్తలతో వీలైనంత మంది తక్కువ క్రూతో సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట. చిత్తూరు జిల్లాశేషాచల అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్‌పైనే ఈసినిమా ప్రధాన కథాంశం రన్ అవుతుంది. ఇందులో బన్నీ పాత్రను.. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే కూలీగా చేరి తర్వాత లారీ డ్రైవర్‌గా మారి, తర్వాత పెద్ద స్మగ్లర్ రేంజ్‌కు ఎలా చేరుకున్నాడనేలా సుక్కు తీర్చిదిద్దారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments