డేట్ ఫిక్స్ చేసుకున్న ‘పుష్ప’‌.. 

  • IndiaGlitz, [Sunday,January 03 2021]

ఈ ఏడాది 'అల వైకుంఠపురములో' సినిమాతో నాన్‌ 'బాహుబలి' రికార్డులు క్రియేట్‌ చేసిన బన్నీ.. సుకుమార్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీగా ‘పుష్ప’ను అనౌన్స్ చేయగానే కోవిడ్ ప్ర‌భావం స్టార్ట్ అయ్యింది. సెట్స్ మీద‌కు వెళ్ల‌డానికే ఆరేడు నెల‌లు పట్టింది. తీరా ‘పుష్ప’ షూటింగ్ రాజ‌మండ్రి స‌మీపంలోని అట‌వీ ప్రాంతం మారేడు మిల్లిలో స్టార్ట్ చేశారు. అయితే సినిమా షూటింగ్‌కు కరోనా ఎఫెక్ట్‌ తగిలింది. దీంతో షూటింగ్‌ను ఆపేసిన యూనిట్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. రీసెంట్‌గానే బ‌న్నీ, సుకుమార్ అండ్ టీమ్ మ‌ళ్లీ మారేడు మిల్లి ప్రాంతంలో షూటింగ్ స్టార్ట్ చేస్తార‌ని వార్త‌లు వినిపించాయి. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు జ‌న‌వ‌రి 8 నుండి బ‌న్నీ ‘పుష్ప’ సినిమా మ‌ళ్లీ పునః ప్రారంభం అవుతుంద‌ని అంటున్నారు.

ఈసారి మరింత కట్టుదిట్టంగా.. తగు జాగ్రత్తలతో వీలైనంత మంది తక్కువ క్రూతో సుకుమార్‌ ఈ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్‌ చేస్తున్నాడట. చిత్తూరు జిల్లాశేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర‌చంద‌నం స్మగ్లింగ్‌పైనే ఈసినిమా ప్ర‌ధాన కథాంశం ర‌న్ అవుతుంది. ఇందులో బ‌న్నీ పాత్ర‌ను.. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ చేసే కూలీగా చేరి త‌ర్వాత లారీ డ్రైవ‌ర్‌గా మారి, త‌ర్వాత పెద్ద స్మ‌గ్ల‌ర్ రేంజ్‌కు ఎలా చేరుకున్నాడ‌నేలా సుక్కు తీర్చిదిద్దార‌ట‌.

More News

యూపీలో ఘోర ప్రమాదం.. భవనం పైకప్పు కూలి 18 మంది మృతి

ఉత్తరప్రదేశ్ ఘాజియాబాద్‌ మురాద్‌నగర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

'సైకో వర్మ' సాంగ్ విడుదల

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ పై వస్తున్న మరో చిత్రం "సైకో వర్మ"  వీడు తేడా..టాగ్ లైన్ .

అందుకు మెగా ఫ్యాన్స్  ఒప్పుకుంటారా..?

మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రంగా మ‌ల‌యాళ చిత్రం ‘లూసిఫ‌ర్’ రీమేక్ కానున్న సంగ‌తి తెలిసిందే.

డైరెక్టర్ క్రిష్‌కు కరోనా పాజిటివ్.. పవన్‌తో షూటింగ్ క్యాన్సిల్..

సినీ ప్రముఖులంతా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టిందనగానే ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా కాస్త రిలాక్స్ అయిపోయారు.

తేజకు అలివేలు దొరికింది.. కానీ..!

డైరెక్ట‌ర్ తేజ ఒకేసారి రెండు సినిమాల‌ను అనౌన్స్‌చేశాడు. అందులో ఓ చిత్రం ‘అలివేలు వెంక‌ట‌ర‌మ‌ణ‌’.