'పుష్ప' రిలీజ్ డేట్ లాక్... ఫ్యాన్ష్ కోసం స్టన్నింగ్ లుక్ ఇచ్చిన స్టైలిష్ స్టార్
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ప్యాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకోవాల్సిన ఈ చిత్రం కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చి ఎట్టకేలకు శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఆగస్ట్ 13న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా ప్రకటించాయి. రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయడంతో పాటు.. ప్యాన్స్ కోసం అదిరిపోయేలా ఓ సూపర్బ్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్‌లో రగ్డ్ లుక్‌లో బన్నీ గొడ్డలి పట్టుకుని కూర్చుని ఉండగా అతని చుట్టూ ఉన్న వారు గొడ్డళ్లు పట్టుకుని నిలుచుని ఉన్నారు.
రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్‌పైనే ప్రధాన కథాంశం రన్ అవుతుంది. ఇందులో బన్నీ పాత్రను.. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే కూలీగా చేరి తర్వాత లారీ డ్రైవర్‌గా మారి, తర్వాత పెద్ద స్మగ్లర్ రేంజ్‌కు ఎలా చేరుకున్నాడనేలా సుక్కు తీర్చిదిద్దారట. ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అలాగే ఆర్య, ఆర్య2 చిత్రాల తర్వాత బన్నీ, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రమిది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments