Pushpa 2 : రామరాజు వస్తే పుష్పరాజ్ ఒప్పుకుంటాడా ..?
Send us your feedback to audioarticles@vaarta.com
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. దేశం మొత్తం పుష్ప పాటలు, డైలాగ్స్‌తో ఊగిపోయింది. ఈ మధ్యకాలంలో సమాజంపై ఈ స్థాయిలో ప్రభావం చూపిన సినిమా మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు తగ్గేదే లే అంటూ గడ్డం కింద చెయ్యి పెట్టి డైలాగ్ చెప్పారు. ఇదే సమయంలో పుష్ప 2 ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లింది చిత్ర యూనిట్. ప్రస్తుతం బ్యాంకాక్‌లో చిత్రీకరణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
పుష్ప 2లో చరణ్ గెస్ట్ రోల్ :
ఇదిలావుండగా పుష్ప 2కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై సుకుమార్ రామ్‌చరణ్‌తో సంప్రదించినట్లుగా ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పుష్ప 2 క్లైమాక్స్‌లో గానీ, ఇంటర్వెల్‌లో గానీ చెర్రీ ఎంట్రీ ఇస్తాడంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో రామ్‌చరణ్ నటించేది గాలి వార్తా, లేక నిజంగానే మీడియాకు లీకులు అందాయా అన్నది తెలియరాలేదు. చిత్ర యూనిట్ స్పందిస్తే కానీ ఈ వార్తలకు చెక్ పడదు.
పాన్ ఇండియా స్టార్లుగా బావా బామ్మర్దులు:
పుష్ప 2లో చరణ్ నటిస్తే మామూలు హైప్ రాదు. ఎవడులో బావా బామ్మర్దులు స్క్రీన్ షేర్ చేసుకున్నప్పటికీ, ఆ సమయంలో వీరిద్దరూ కేవలం తెలుగు మార్కెట్‌పైనే ఆధారపడిన హీరోలు. కానీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్‌తో రామ్‌చరణ్, పుష్పతో అల్లు అర్జున్‌లు పాన్ ఇండియా స్టార్లుగా మారిపోయారు. అందువల్ల దక్షిణాదితో పాటు ఉత్తరాది ఆడియన్స్‌కు కూడా పుష్ప 2 కోసం ఎగ్జయిటింగ్‌గా ఎదురుచూస్తారు. ఫ్యాన్స్‌కి , టాలీవుడ్‌కి కూడా ఇదే కావాలి. అయితే స్వతహాగా అల్లు అర్జున్‌కి అన్నీ తానై చూసుకోవడం ఇష్టం. ఏం జరిగినా అంతా తన పేరు మీదే జరగాలి.. ఫ్యాన్స్‌ని ఖుషీ చేయాలి. అలాంటిది తన సినిమాలో చెర్రీకి స్పేస్ ఇస్తాడా లేదా అంటే అనుమానమే. కాకపోతే.. దర్శకుడు, చిత్ర నిర్మాణ సంస్థ బలంగా కోరుకుంటే మాత్రం చరణ్ గెస్ట్ రోల్ గ్యారెంటీ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments