Pushpa 2 : రామరాజు వస్తే పుష్పరాజ్ ఒప్పుకుంటాడా ..?

  • IndiaGlitz, [Monday,December 12 2022]

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. దేశం మొత్తం పుష్ప పాటలు, డైలాగ్స్‌తో ఊగిపోయింది. ఈ మధ్యకాలంలో సమాజంపై ఈ స్థాయిలో ప్రభావం చూపిన సినిమా మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు తగ్గేదే లే అంటూ గడ్డం కింద చెయ్యి పెట్టి డైలాగ్ చెప్పారు. ఇదే సమయంలో పుష్ప 2 ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లింది చిత్ర యూనిట్. ప్రస్తుతం బ్యాంకాక్‌లో చిత్రీకరణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

పుష్ప 2లో చరణ్ గెస్ట్ రోల్ :

ఇదిలావుండగా పుష్ప 2కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై సుకుమార్ రామ్‌చరణ్‌తో సంప్రదించినట్లుగా ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పుష్ప 2 క్లైమాక్స్‌లో గానీ, ఇంటర్వెల్‌లో గానీ చెర్రీ ఎంట్రీ ఇస్తాడంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో రామ్‌చరణ్ నటించేది గాలి వార్తా, లేక నిజంగానే మీడియాకు లీకులు అందాయా అన్నది తెలియరాలేదు. చిత్ర యూనిట్ స్పందిస్తే కానీ ఈ వార్తలకు చెక్ పడదు.

పాన్ ఇండియా స్టార్లుగా బావా బామ్మర్దులు:

పుష్ప 2లో చరణ్ నటిస్తే మామూలు హైప్ రాదు. ఎవడులో బావా బామ్మర్దులు స్క్రీన్ షేర్ చేసుకున్నప్పటికీ, ఆ సమయంలో వీరిద్దరూ కేవలం తెలుగు మార్కెట్‌పైనే ఆధారపడిన హీరోలు. కానీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్‌తో రామ్‌చరణ్, పుష్పతో అల్లు అర్జున్‌లు పాన్ ఇండియా స్టార్లుగా మారిపోయారు. అందువల్ల దక్షిణాదితో పాటు ఉత్తరాది ఆడియన్స్‌కు కూడా పుష్ప 2 కోసం ఎగ్జయిటింగ్‌గా ఎదురుచూస్తారు. ఫ్యాన్స్‌కి , టాలీవుడ్‌కి కూడా ఇదే కావాలి. అయితే స్వతహాగా అల్లు అర్జున్‌‌కి అన్నీ తానై చూసుకోవడం ఇష్టం. ఏం జరిగినా అంతా తన పేరు మీదే జరగాలి.. ఫ్యాన్స్‌ని ఖుషీ చేయాలి. అలాంటిది తన సినిమాలో చెర్రీకి స్పేస్ ఇస్తాడా లేదా అంటే అనుమానమే. కాకపోతే.. దర్శకుడు, చిత్ర నిర్మాణ సంస్థ బలంగా కోరుకుంటే మాత్రం చరణ్‌ గెస్ట్ రోల్ గ్యారెంటీ.

More News

Mythri Movie Makers : మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయంలో ఐటీ సోదాలు.. ఉలిక్కిపడ్డ టాలీవుడ్

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఈడీ, ఐటీ దాడులు కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల ఇళ్లు , కార్యాలయాలపై రైడ్స్ జరుగుతున్నాయి.

tamanna bhatia : అది బ్రానా, టాపా... ఏంటో చెప్పమ్మా .. సెగలు రేపుతోన్న తమన్నా అందం

సాధారణంగా హీరోలతో పోలిస్తే హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. మహా అయితే ఐదేళ్లు, లేదా మంచి హిట్లు పడితే ఇంకో రెండేళ్లు అంతేకానీ బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోని హీరోయిన్ల

BiggBoss: ఇనయా ఔట్... కంటతడిపెట్టిన లేడీ టైగర్, మిడ్ వీక్ మరో ఎలిమినేషన్

బిగ్‌బాస్ 6 తెలుగులో మరోసారి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యింది. ఖచ్చితంగా టాప్ 5లో చోటు దక్కించుకుంటుందని అంతా భావించిన ఇనయాను బయటకు పంపారు.

Veera Simha Reddy: డిసెంబర్ 15న 'వీరసింహారెడ్డి' 'సుగుణ సుందరి' లిరికల్ వీడియో విడుదల

గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో

BiggBoss: బిగ్‌బాస్ విన్నర్‌కు ‘రూ.కోటి’..... శ్రీహాన్- రేవంత్ మధ్య చిచ్చుపెట్టిన నాగ్

బిగ్‌బాస్ 6 తెలుగు చివరి అంకానికి చేరుకుంది. మరికొద్దిరోజుల్లో విన్నర్ ఎవరో తెలిసిపోనుంది. ఇప్పటికే టికెట్ టు ఫినాలే టాస్క్‌లో గెలిచి శ్రీహాన్ ఫైనల్‌లో అడుగుపెట్టగా...