పాటలే ముందు అంటోన్న ‘పుష్ప’
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ ఏదాది సంక్రాందిలో అల వైకుంఠపురములో చిత్రంతో భారీ హిట్ సాధించాడు. అంతా అనుకున్నట్లు జరిగి ఉండుంటే ఈపాటికి సుకుమార్ దర్శకత్వంలో తన 20వ చిత్రం పుష్పను స్టార్ట్ చేసుండేవాడు బన్నీ. నిజానికి సమ్మర్‌లో కేరళలో భారీ షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అయితే కరోనా ఎఫెక్ట్‌తో లాక్‌డౌన్ విధించారు. దీని వల్ల షూటింగ్స్‌ను ఆపేశారు. దీంతో రెండు నెలల పాటు షూటింగ్స్ ఆగిపోయాయి.
ఎట్టకేలకు ఇప్పుడు ప్రభుత్వాలు సినిమా షూటింగ్స్‌కు అనుమతులను ఇచ్చింది. అయితే లొకేషన్‌లో 40 నుండి 50 మంది మాత్రమే ఉండాలని నిబంధనలు విధించాయి. సాధారణంగా రెండు వందల మందితో జరిగే షూటింగ్స్ యాబై మందితో చేయాలంటే కాస్త ఇబ్బందికరమైన పరిస్థితనే చెప్పాలి. ఈ క్రమంలో సెట్స్‌పైకి వెళ్లాలనుకుంటున్న పుష్ప యూనిట్ ఓ ప్లాన్ చేసిందట. ముందుగా సినిమాకు సంబంధించిన పాటలను చిత్రీకరించాలని అనుకుంటున్నారట. దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే నాలుగు ట్యూన్స్‌ను సిద్ధం చేశాడట. పాటలు కాబట్టి పరిమితమైన సభ్యులతోనే పాటలను చిత్రీకరించాలని అనుకుంటున్నారని టాక్. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. పాన్ ఇండియా నటీనటులు ఇందులో నటించనున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే చిత్రమిది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com