పాటలే ముందు అంటోన్న ‘పుష్ప’

  • IndiaGlitz, [Monday,June 15 2020]

ఈ ఏదాది సంక్రాందిలో అల వైకుంఠపురములో చిత్రంతో భారీ హిట్ సాధించాడు. అంతా అనుకున్నట్లు జరిగి ఉండుంటే ఈపాటికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 20వ చిత్రం పుష్ప‌ను స్టార్ట్ చేసుండేవాడు బ‌న్నీ. నిజానికి స‌మ్మ‌ర్‌లో కేర‌ళ‌లో భారీ షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అయితే కరోనా ఎఫెక్ట్‌తో లాక్‌డౌన్ విధించారు. దీని వ‌ల్ల షూటింగ్స్‌ను ఆపేశారు. దీంతో రెండు నెల‌ల పాటు షూటింగ్స్ ఆగిపోయాయి.

ఎట్ట‌కేల‌కు ఇప్పుడు ప్ర‌భుత్వాలు సినిమా షూటింగ్స్‌కు అనుమ‌తుల‌ను ఇచ్చింది. అయితే లొకేష‌న్‌లో 40 నుండి 50 మంది మాత్ర‌మే ఉండాల‌ని నిబంధ‌న‌లు విధించాయి. సాధార‌ణంగా రెండు వంద‌ల మందితో జ‌రిగే షూటింగ్స్ యాబై మందితో చేయాలంటే కాస్త ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితనే చెప్పాలి. ఈ క్ర‌మంలో సెట్స్‌పైకి వెళ్లాల‌నుకుంటున్న పుష్ప యూనిట్ ఓ ప్లాన్ చేసింద‌ట‌. ముందుగా సినిమాకు సంబంధించిన పాట‌ల‌ను చిత్రీక‌రించాల‌ని అనుకుంటున్నార‌ట‌. దేవిశ్రీ ప్ర‌సాద్ ఇప్ప‌టికే నాలుగు ట్యూన్స్‌ను సిద్ధం చేశాడ‌ట‌. పాట‌లు కాబ‌ట్టి ప‌రిమిత‌మైన స‌భ్యుల‌తోనే పాట‌ల‌ను చిత్రీక‌రించాల‌ని అనుకుంటున్నార‌ని టాక్‌. పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. పాన్ ఇండియా న‌టీన‌టులు ఇందులో న‌టించ‌నున్నారు. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది.

More News

‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ షాకిచ్చాడా?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తోన్న చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’. దాదాపు 75 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య‌

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈయ‌న వ‌య‌సు 34 ఏళ్లు.

10మిలియ‌న్స్ వ్యూస్ క్రాస్ చేసిన BB3 First Roar

సింహా', 'లెజెండ్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ త‌ర్వాత‌ నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో

సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న సాయితేజ్ ‘నో పెళ్లి..’ సాంగ్

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్‌.ఎల్‌.పి బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌`.

మాక్ షూట్‌కి జ‌క్క‌న్న అండ్ టీమ్‌

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళిపై రెండు తెలుగు ప్ర‌భుత్వాలు పెద్ద బాధ్య‌త‌నే పెట్టాయ‌నుకోవాలి.