'ఊ అంటావా మావ.. ఊఊ అంటావా'.. మాస్ సాంగ్‌లో అదరగొట్టేసిన సమంత
Send us your feedback to audioarticles@vaarta.com
నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత క్రేజ్ బాగా పెరిగింది. వరుస ఆఫర్లు క్యూకడుతున్నాయి. ఏకంగా హాలీవుడ్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. అలాగే ది ఫ్యామిలీ మెన్ 2 సిరీస్‌లో రాజీ పాత్రకు గాను ఫిలింఫేర్ అవార్డ్ సొంతం చేసుకుంది. ఇకపోతే అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న పుష్పలో సమంత స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తక్కువకాలంలోనే స్టార్ హీరోయిన్గా స్టార్డమ్ సంపాదించుకున్న సామ్ తన కెరీర్లో తొలిసారిగా ఐటం సాంగ్‌లో నటించింది.
దీనికి సంబంధించి శుక్రవారం సాయంత్రం ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’ అంటూ సాగే పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా... ఇంద్రావతి చౌహాన్ ఆలపించారు. కేవలం ఐదు రోజులు మాత్రమే షూటింగ్ చేసిన ఈ పాట కోసం సమంత ఏకంగా కోటి 30 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే పాట బాగా రావడానికి సాయం చేసిన చిత్ర యూనిట్‌కు అల్లు అర్జున్ గోల్డెన్ రింగ్స్ గిఫ్ట్‌గా ఇచ్చారు.
డిసెంబర్ 17న విడుదలకానున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ముత్తంశెట్టి మీడియా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న పుష్పలో హీరోయిన్గా రష్మిక మందన్నా నటిస్తున్నారు. మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫజిల్ , సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈనెల 12న ‘పుష్ప ప్రీరిలీజ్ పార్టీ’ని హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout