'ఊ అంటావా మావ.. ఊఊ అంటావా'.. మాస్ సాంగ్‌లో అదరగొట్టేసిన సమంత

  • IndiaGlitz, [Friday,December 10 2021]

నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత క్రేజ్ బాగా పెరిగింది. వరుస ఆఫర్లు క్యూకడుతున్నాయి. ఏకంగా హాలీవుడ్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. అలాగే ది ఫ్యామిలీ మెన్ 2 సిరీస్‌లో రాజీ పాత్రకు గాను ఫిలింఫేర్ అవార్డ్ సొంతం చేసుకుంది. ఇకపోతే అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న పుష్పలో సమంత స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తక్కువకాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా స్టార్‌డమ్‌ సంపాదించుకున్న సామ్‌ తన కెరీర్‌లో తొలిసారిగా ఐటం సాంగ్‌లో నటించింది.

దీనికి సంబంధించి శుక్రవారం సాయంత్రం ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’ అంటూ సాగే పాటకు సంబంధించిన లిరికల్‌ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించగా... ఇంద్రావతి చౌహాన్‌ ఆలపించారు. కేవలం ఐదు రోజులు మాత్రమే షూటింగ్ చేసిన‌ ఈ పాట కోసం స‌మంత‌ ఏకంగా కోటి 30 లక్షల రెమ్యునరేషన్ అందుకున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే పాట బాగా రావడానికి సాయం చేసిన చిత్ర యూనిట్‌కు అల్లు అర్జున్ గోల్డెన్ రింగ్స్ గిఫ్ట్‌గా ఇచ్చారు.

డిసెంబర్ 17న విడుదలకానున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ముత్తంశెట్టి మీడియా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న పుష్పలో హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటిస్తున్నారు. మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫజిల్ , సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈనెల 12న ‘పుష్ప ప్రీరిలీజ్‌ పార్టీ’ని హైదరాబాద్‌ పోలీస్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నారు.

More News

మంచి సినిమాలను ఆదరిస్తారని మళ్లీ నిరూపించారు.. అఖండ విజయోత్సవ జాతర వేడుకలో నందమూరి బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా

‘స్పైడర్ మెన్ : నో వే హోమ్’ను భారీ ఎత్తున విడుదల చేస్తోన్న సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్స్ ఇండియా

మార్వెల్స్ ఆధ్వర్యంలో తెరకెక్కిన స్పైడర్ మెన్ : నో వే హోమ్ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

శ్రీదేవి మేనకోడలు,  శివాజీ గణేశన్ మనవడు జంటగా... పద్మిని మనవరాలు తీస్తున్న మ్యూజిక్ వీడియో 'యదలో మౌనం'

పురస్కారాలు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఫిల్మ్ మేకర్... దివంగత నటి, భరతనాట్యం కళాకారిణి పద్మిని రామచంద్రన్ మనవరాలు లక్ష్మీ దేవి రూపొందిస్తున్న మ్యూజిక్ వీడియో

'ఆర్ఆర్ఆర్' కోసం ఎన్టీఆర్ ఎన్ని సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందంటే..?

ట్రైలర్ లాంచ్ కావడంతో తెలుగు నాట ఆర్ఆర్ఆర్ మేనియా స్టార్ట్ అయ్యింది. సినిమా ఎలా వుండబోతోంది...?

ది ఫ్యామిలీ మాన్ సీజ‌న్ – 2 : ‘‘రాజీ’’కి ఫిల్మ్ ఫేర్ అవార్డ్.. ఫుల్ జోష్‌లో సమంత

ఇటీవ‌ల అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల అయిన ‘‘ ది ఫ్యామిలీ మాన్ సీజ‌న్ – 2’’ లో టాలీవుడ్ అగ్ర కథానాయిక స‌మంత న‌టించిన విష‌యం తెలిసిందే.