అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. 'పుష్ప' గాడి మాస్ జాతర మొదలు..
Send us your feedback to audioarticles@vaarta.com
'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమాలోని నటనగాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా అందుకున్నాడు. దీంతో ఆ చిత్రానికి సీక్వెల్‍గా వస్తున్న 'పుష్ప2'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్, పోస్టర్‌లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా మూవీ టీజర్ విడుదల తేదీని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పుష్ప మాస్ జాతర మొదలైందంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.
"పుష్ప మాస్ జాతరను మొదలుపెడదాం. ఎంతగానో ఎదురుచూస్తున్న పుష్ప2- ది రూల్ టీజర్ ఏప్రిల్ 8వ తేదీన రానుంది. ఫైర్‌ను డబుల్ చేసేందుకు అతడు వచ్చేస్తున్నాడు" అని మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. ఆగస్టు 15వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుందని స్పష్టం చేసింది. ఈ పోస్టర్‌లో అల్లు అర్జున్ గజ్జెలు ధరించిన కాలు ఉంది. జాతర సీక్వెన్సులో వెనుక దీపాలు వెలుగుతుండగా.. నేలమీద పడిన కుంకుమపై కాలు మోపినట్టు ఈ పోస్టర్‌లో ఉంది. దీంతో టీజర్లో ఎక్కువగా జాతర యాక్షన్ సీక్వెన్స్ ఉండే అవకాశం ఉంది.
జాతరలో అల్లు అర్జున్ అమ్మోరు అవతారంలో నాట్యం చేయనున్నారట. అలాగే ఆ బ్యాక్ డ్రాప్‌లో ఓ అదిరిపోయే ఫైట్ సీక్వెన్స్ కూడా ఉండబోతుందని.. కేవలం ఈ ఒక్క సీక్వెన్స్ కోసమే దర్శకుడు సుకుమార్ చాలా ఖర్చు చేసి తెరకెక్కించారట. మూవీకి ఈ సీక్వెన్స్ హైలైట్ కాబోతుందని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే బాణీలు అందించాడట. ఈ జాతర సాంగ్ కూడా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తుందని చెబుతున్నారు. దీంతో అభిమానులు ఈ మూవీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే 'పుష్ప2' సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఇటీవలే వైజాగ్‍లో షెడ్యూల్ పూర్తవ్వగా.. ప్రస్తుతం హైదరాబాద్‍లో షూటింగ్ జరుగుతోంది. భారీస్థాయిలో యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్‍గా చేస్తున్నారు. వీరితో పాటు జగదీశ్ ప్రతాప్ బండారీ, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రామేశ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout