‘పుష్ప’ యూనిట్‌లో విషాదం.. ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ మృతి..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ జి.శ్రీనివాస్ (54) గురువారం అర్థరాత్రి ఒంటిగంటకు రాజమండ్రిలో గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం శ్రీనివాస్ ‘పుష్ప’ సినిమాకు స్టిల్ ఫోటో గ్రాఫర్‌గా పని చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన ‘పుష్ప’ షూటింగ్ నిమిత్తం మారేడుమిల్లి వెళ్లారు. అక్కడ ఒంట్లో బాగోలేకపోవడంతో లొకేషన్‌లోని అంబులెన్స్‌లో ‘పుష్ప’ చిత్రబృందం రాజమండ్రి వస్తుండగా మరణించారు. శ్రీనివాస్ దాదాపు 200 లకు పైగా సినిమాలకు స్టిల్ ఫోటోగ్రాఫర్‌గా పనిచేశారు, ఆయనకు భార్య, ఇద్దరు కుమర్తెలున్నారు.
శ్రీనివాస్ స్వస్థలం భీమవరం. ఆయన 1982వ సంవత్సరంలో ‘విముక్తి కోసం’ చిత్రం ద్వారా తన సినీ స్టిల్ ఫోటోగ్రాఫర్‌గా ప్రస్థానం ప్రారంభించారు. అప్పటి నుంచి నిన్నటి దాదాపు 250 సినిమాలకు పైగా స్టిల్ ఫోటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. గతంలో స్టిల్ ఫోటో గ్రాఫర్స్ అసోసియేషన్ ట్రెజరర్‌గా 6 సంవత్సరాలు, సెక్రటరీగా 4 సంవత్సరాలు, ప్రెసిడెంట్‌గా 2 సంవత్సరాలు పని చేశారు. శ్రీనివాస్ మృతితో ‘పుష్ప’ యూనిట్‌లో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout