అదుగో సినిమాలో పూర్ణ స్పెషల్ సాంగ్..
Send us your feedback to audioarticles@vaarta.com
రవిబాబు తెరకెక్కిస్తున్న అదుగో సినిమాలో నటి పూర్ణ ప్రత్యేక గీతంలో నటించనుంది. ఈ పాట సెప్టెంబర్ 17న విడుదల కానుంది. ఈ పాటలో పూర్ణతో పాటు సినిమాలో టైటిల్ రోల్ చేస్తున్న బంటి అండే పందిపిల్ల కూడా కనిపించనుంది. ఈ పాట విజువల్ ట్రీట్ ఇవ్వబోతుంది.
ఈ సందర్భంగా పాటలోని పూర్ణ స్టిల్ ఒకటి విడుదల చేసారు. ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. రవిబాబు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దసరా సెలవుల్లో విడుదల కానుంది అదుగో.
ఇతర భాషల్లోకి కూడా అనువాదం అయి.. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో అదుగో చిత్రం విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments