ఓల్డేజ్... పూరి ఇచ్చిన సలహా
Send us your feedback to audioarticles@vaarta.com
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొన్ని విషయాలను తన అభిప్రాయాలను చెబుతూ వీడియోలను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో ఇప్పటికే కొన్ని టాపిక్‌ల గురించి తన అభిప్రాయాలు చెప్పిన పూరి. ఇప్పుడు ఓల్డేజ్ గురించి మాట్లాడారు.
‘‘పుట్టిన ప్రతి దానికి ఓల్డేజ్ తప్పదు. అయితే ఎగ్జిస్టెన్స్ ఉంటే ఓల్డేజ్ ఉండదు. మనం రిటైర్ అయిపోయామని గవర్నమెంట్ చెబితే మనకు నీరసం వస్తది. మనం ఇక ఎవరికీ అక్కర్లేదా? అనిపిస్తుంది. మనల్ని పట్టించుకోవడం మానేస్తారు. భగవద్గీత చదివితే చిన్నప్పుడే చదవాలి. ఓల్డేజ్‌లో చదివితే లాభం లేదు. దాని వల్ల కాస్త జాగ్రత్త పడేవాళ్లం. అలాగే రామకోటి రాస్తూ కూడా మీ పిల్లలకి కనిపించకండి. మిమ్మల్ని ముసలాళ్లలో కలిపేస్తారు. మీ పిల్లలకు ఏమీ తెలియదని అనుకోవద్దు. ఎందుకంటే మీరు స్కూల్‌లో చదువుకుంటే వాళ్లు యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. వాళ్లకి చాలా విషయాలు తెలిసుంటాయి. అందుకనే మీరు అప్‌డేట్ అవ్వండి.
పిల్లల మైండ్‌తో ఆలోచించండి. మీ అవసరం వాళ్లకు కలిగేలా చేయండి. కనీసం రెండు నిమిషాలైనా మోకాళ్లపై నిలబడి తపస్సు చేయండి. దాని వల్ల మోకాళ్లు స్ట్రాంగ్ అవుతాయి. 65 ఏళ్లు వస్తేనే ఓల్డేజ్ వచ్చినట్లు లెక్క. కాబట్టి.. ఏదో ఒక ఆర్ట్ నేర్చుకోండి. యంగస్టర్స్‌తో ఫ్రెండ్‌షిప్ చేయండి. యంగస్టర్స్ మీ ఇంటికి రావాలి. ఎంత డబ్బున్నా ఖాళీగా ఉండొద్దు. ఏదో ఒక పనిచేయండి. మీ మెచ్యూరిటీయే మీకు అందం. ముఖం మీద ముడతలు కూడా అందంగా కనపడతాయి’’ అన్నారు పూరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout