క‌ళ్యాణ్ రామ్ న్యూలుక్ అదిరింది..

  • IndiaGlitz, [Tuesday,May 31 2016]

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్న చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్ ప‌వ‌ర్ ఫుల్ జ‌ర్న‌లిస్ట్ గా న‌టిస్తున్నారు.

అయితే...ఈరోజు పూరి జ‌గ‌న్నాథ్ ట్విట్ట‌ర్ లో ఈ చిత్రంలోని క‌ళ్యాణ్ రామ్ లుక్ రిలీజ్ చేసారు. డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్...డిఫ‌రెంట్ గెట‌ప్ తో ఉన్న‌ క‌ళ్యాణ్ రామ్ లుక్ ఈ మూవీ పై మ‌రింత ఇంట్ర‌స్ట్ క‌లిగిస్తుంది. ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర పోషిస్తున్నారు. 15 ఏళ్ల త‌ర్వాత పూరి - జ‌గ‌ప‌తి క‌లిసి ఈ చిత్రానికి వ‌ర్క్ చేస్తుండ‌డం విశేషం. త్వ‌ర‌లో స్పెయిన్ లో షూటింగ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేయ‌నున్నారు. క‌ళ్యాణ్ రామ్ ని డిఫ‌రెంట్ గా చూపిస్తున్న పూరి ఈ మూవీతో సూప‌ర్ హిట్ సాధిస్తాడ‌ని ఆశిద్దాం.

More News

'బిచ్చగాడు' సక్సెస్ మీట్

విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా నటించిన తమిళ చిత్రం 'పిచ్చైకారన్'. శశి దర్శకుడు. ఫాతిమా విజయ్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మించారు.

నిఖల్, వి.ఐ.ఆనంద్ , మేఘన ఆర్ట్స్ కాంబినేషన్ చిత్రం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'

స్వామిరారా,కార్తికేయ,సూర్య vs సూర్య లాంటి వైవిధ్యమైన కథాంశాల తో సరికొత్త కథనాలతో వరుస సూపర్హిట్ చిత్రాలతో టాలీవుడ్ ట్రేండ్ ని మార్చిన యంగ్ఎనర్జిటిక్ హీరో నిఖిల్,

స‌మంత పెళ్లి గురించి మ‌రో వార్త‌

అందాల బొమ్మ స‌మంత త్వ‌ర‌లో టాలీవుడ్ యంగ్ హీరోను పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు ఓ ఇంట‌ర్ వ్యూ లో చెప్పిన విష‌యం తెలిసిందే. స‌మంత ఇలా చెప్పిందో లేదో...అలా టాలీవుడ్, కోలీవుడ్ ఇండ‌స్ట్రీలో స‌మంత పెళ్లి వార్త హాట్ టాపిక్ అయ్యింది.

శ్రీనివాసుడిని ద‌ర్శించుకున్న నితిన్..

యువ హీరో నితిన్ - స‌మంత జంట‌గా తెర‌కెక్కిన చిత్రం అ ఆ. ఈ చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తెర‌కెక్కించారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.

పనిలేని పులిరాజు సాంగ్ లీకైంది..

ధన్ రాజ్ పదమూడు పాత్రల్లో నటించిన చిత్రం పనిలేని పులిరాజు.