కళ్యాణ్ రామ్ న్యూలుక్ అదిరింది..
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా డేరింగ్ & డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ జర్నలిస్ట్ గా నటిస్తున్నారు.
అయితే...ఈరోజు పూరి జగన్నాథ్ ట్విట్టర్ లో ఈ చిత్రంలోని కళ్యాణ్ రామ్ లుక్ రిలీజ్ చేసారు. డిఫరెంట్ హెయిర్ స్టైల్...డిఫరెంట్ గెటప్ తో ఉన్న కళ్యాణ్ రామ్ లుక్ ఈ మూవీ పై మరింత ఇంట్రస్ట్ కలిగిస్తుంది. ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. 15 ఏళ్ల తర్వాత పూరి - జగపతి కలిసి ఈ చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. త్వరలో స్పెయిన్ లో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు. కళ్యాణ్ రామ్ ని డిఫరెంట్ గా చూపిస్తున్న పూరి ఈ మూవీతో సూపర్ హిట్ సాధిస్తాడని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com