'లోఫర్ ' లోనూ పూరీ ఫార్ములా అదేనా?
- IndiaGlitz, [Thursday,November 05 2015]
పూరీ జగన్నాథ్ సినిమాల్లో మెయిన్ లీడ్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. అదే సినిమాకి ప్లస్‌పాయింట్‌గా నిలుస్తుంది. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ గత చిత్రాలు 'టెంపర్', 'జ్యోతిలక్ష్మీ' చిత్రాల్లో కూడా దీన్ని గమనించవచ్చు.
'టెంపర్'లో ఫస్టాఫ్‌లో కంప్లీట్ నెగెటివ్ టచ్‌తో హీరో రోల్ ఉండి.. సెకండాఫ్‌లో క్రమంగా ఛేంజ్ అయి క్లాప్స్ కొట్టించే రేంజ్‌కి చేరుకుంటుంది. ఇక 'జ్యోతిలక్ష్మీ'లోనూ ఛార్మి పాత్ర ఫస్టాఫ్లోఓ రకంగా ఉండి.. సెకండాఫ్‌లో సొసైటీకి ఉపయోగపడేంతలా ఛేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇదే ఫార్ములాని 'లోఫర్' సినిమాకి కూడా పూరి అప్లయ్ చేస్తున్నాడని కథనాలు వినిపిస్తున్నాయి.
'లోఫర్'లో వరుణ్ తేజ్ పాత్ర టైటిల్‌కి తగ్గట్టుగా ప్రథమార్థంలో ఉండి.. ద్వితీయార్థంలో విజిల్స్ వేయించే రేంజ్లో ఛేంజ్ ఉంటుందని ఇన్సైడ్ సోర్స్ చెబుతోంది. ఇందులో ఏ మేరకు నిజముందో త్వరలోనే తెలుస్తుంది. డిసెంబర్లో లేదా జనవరిలో 'లోఫర్' విడుదల కానుంది.