ప్రధానికి పూరి లేఖ
Send us your feedback to audioarticles@vaarta.com
భారత ప్రధాని నరేంద్ర మోదీకి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పర్యావరణ పరిరక్షణ గురించి కొన్ని సూచనలు ఇస్తూ బహిరంగ లేఖ రాశారు. దేశంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని మోదీ తెలియజేసిన సంగతి తెలిసిందే. రీసెంట్గా మహాబలిపురం బీచ్లోనూ ఆయన ప్లాస్టిక్‌ను ఏరుతూ కనిపించారు. ఈ నేపథ్యంలో ప్రధానికి పూరి రాసిన లేఖ ప్రాధాన్యతను సంతరించుకుంది. పూరి తాను రాసిన లేఖను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
``వాతావరణంలో మార్పు ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. వాటిలో ప్లాస్టిక్ వాడకం కూడా ఒకటి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నియంత్రించినంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందనుకుంటే పొరపాటే. వాడిన ప్లాస్టిక్‌ను ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది. ప్లాస్టిక్‌ను నియంత్రించి ఎకో ఫ్రెండ్లీ బ్యాగులను తీసుకొస్తే చాలా చెట్టు నాశనం అవుతాయి. దాని వల్ల పర్యావరణం పాడవుతుంది. ఈ వాతావరణ మార్పుల నుండి బయటప పడాలంటే ముందు మొక్కలను ఎక్కువగా నాటాలి. భూమి మీద జనాభా పెరగడం వల్ల భవిష్యత్తులో వచ్చే ప్రమాదాల గురించి అందరికీ అవగాహన కలిగించాలి.
ఒకసారి వాడిన ప్లాస్టిక్‌ను మళ్లీ మళ్లీ వాడేలా చర్యలు తీసుకోవాలి. ఇందులో ప్రభుత్వం రీసైక్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసి, ఒకసారి వాడిన ప్లాస్టిక్‌ను తీసుకొచ్చి ఇస్తే డబ్బులు ఇస్తామని ప్రకటించాలి. ప్రజలు వాడిన ప్లాస్టిక్ కవర్లను రీసైక్లింగ్ యూనిట్స్లోనే ఇస్తారు. ఇలా చేస్తే పర్యావరణాన్ని కాస్త కాపాడుకోవచ్చు. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్లాస్టిక్‌ను నియంత్రించడమే కాదు.. వాహన కాలుష్యాన్ని కూడా నియంత్రించాలి`` అన్నారు.
Dear Hon'ble Prime Minister Shri @narendramodi ji
— PURIJAGAN (@purijagan) October 20, 2019
IS SINGLE USE PLASTIC REALLY A PROBLEM? pic.twitter.com/sf6A6WMA45
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout