పూరి..ఎవరి మాట వినడంతే
- IndiaGlitz, [Thursday,October 15 2015]
డేరింగ్ & డేషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్...ఇడియట్, పోకిరి, దేశముదురు, లోఫర్...ఇలా నెగిటివ్ టైటిల్స్ పెట్టి సెక్సెస్ సాధించి ఓ ట్రెండ్ క్రియేట్ చేసారు. అయితే మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా పూరి తెరకెక్కిస్తున్న చిత్రం లోఫర్. ఈ చిత్రానికి లోఫర్ అనే టైటిల్ పెట్టినప్పటికీ...కథలో మదర్ సెంటిమెంట్ ఉంది. కాబట్టి లోఫర్ టైటిల్ మార్చమని రామ్ గోపాల్ వర్మ, సి.కళ్యాణ్ పూరి పై ఒత్తిడి తేవడం... గురువు వర్మ మాటకు విలువ ఇచ్చి శిష్యుడు పూరి టైటిల్ మార్చడానికి ఓకె అనడం తెలిసిందే.
అయితే పూరి లోఫర్ టైటిల్ మారుస్తాననడంతో పూరి మారాడు అనుకున్నారు. కానీ..పూరి..నేనింతే అంటున్నాడు. అందుకే తన తదుపరి చిత్రానికి రోగ్ అనే టైటిల్ ఫిక్స్ చేసాడు. ఇలా నెగిటివ్ టైటిల్స్ పెడుతున్నారు...దీని వలన ప్రజల పై ప్రభావం ఉంటుంది కదా...అని పూరిని అడిగితే...పోకిరి అని నెగిటివ్ టైటిల్ పెట్టడం వలన దేశానికి వచ్చిన నష్టం ఏమిటి అని ప్రశ్నిస్తున్నాడు. పోకిరి సినిమాని చూసి నన్ను ఎంతో మంది పోలీసులు మెచ్చుకున్నారు అంటున్నాడు. పూరి మాటలను బట్టి చూస్తుంటే భవిష్యత్ లో పూరి నుంచి ఇలాంటి టైటిల్స్ ఇంకా వస్తాయి అనిపిస్తుంది. పూరి...ఎవరి మాట వినడంతే.