స్పానిష్ మీడియాను ఆకర్షించిన ఇజం...

  • IndiaGlitz, [Wednesday,August 24 2016]

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ఇజం. నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా న‌టిస్తూ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్ర‌స్తుతం సినిమా స్పెయిన్‌లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ఇజం సినిమా మేకింగ్ అక్క‌డ స్పానిష్ మీడియాను ఆక‌ర్షించ‌డంతో వారు సినిమా క‌వ‌రేజ్ చేశార‌ట‌. పాటలతో పాటు యాక్షన్ సన్నివేశాల మేకింగ్ ఇప్ప‌డు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ సినిమా క‌ల్యాణ్‌రామ్ సిక్స్ ప్యాక్‌లో క‌న‌ప‌డ‌నున్నాడు. ప‌వ‌ర్ ఫుల్ జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న క‌ల్యాణ్ రామ్‌కు జంట‌గా ఆదితి ఆర్య న‌టిస్తుంది. సినిమాను సెప్టెంబ‌ర్ 29న విడుద‌ల చేయ‌డానికి ప్ర‌యత్నాలు జ‌రుగుతున్నాయి.