‘జనగణమన’ ఆ హీరోతోనే.. క్లారిటీ ఇచ్చేసిన పూరి, తన గొంతుతోనే చెప్పేశాడుగా

‘‘ జనగణమన’’.. దర్శకుడు పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్. పవన్ కల్యాణ్, మహేశ్ బాబులలో ఒకరితో ఈ సినిమాను పట్టాలెక్కించాలన్నది పూరి ప్లాన్. ఇది ఈనాటిది కాదు.. ఎప్పుడో ఇందుకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారు జగన్. కానీ ఎప్పుడూ ఏదో ఒక అవాంతరాలతో ప్రాజెక్ట్ అటకెక్కుతోంది. అయితే గడిచిన కొన్నిరోజులుగా జనగణమన సినిమా గురించి చిత్ర సీమలో బాగా చర్చ జరుగుతోంది. మహేశ్ హీరోగా ఈ సినిమాకు త్వరలోనే శ్రీకారం చుడతారని ఫిలింనగర్ టాక్. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో పోకిరి, బిజినెస్‌మెన్ సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. దీంతో హ్యాట్రిక్ మూవీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రచారానికి చెక్ పెడుతూ పూరి జగన్నాథ్ క్లారిటీ ఇచ్చేశారు.

వివరాల్లోకి వెళితే.. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లైగర్’. ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, ఛార్మి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టగా తాజాగా ఆదివారంతో ‘లైగర్’ చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పూరీ జగన్నాథ్ వాయిస్‌తో ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు ఛార్మి. మామూలుగా అయితే దీనిని ఎవరూ పట్టించుకునేవారు కాదు.. కాకపోతే, పూరి తన వాయిస్‌లో ‘‘ ఇప్పుడే లైగర్ షూటింగ్ పూర్తయింది. ఈ రోజుతో జన గణ మన” అని చెప్పడంతో అందరూ అటెన్షన్ అయ్యారు. దీనిని బట్టి జనగణమనను పూరి.. విజయ్ దేవరకొండతో తీస్తారని హింట్ ఇచ్చారంటూ ప్రచారం జరుగుతోంది.

ఇకపోతే.. ఆగస్ట్ 25న లైగర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను స‌రికొత్త లుక్‌, క్యారెక్ట‌రైజేష‌న్‌తో పూరి త‌న‌దైన స్టైల్లో సిల్వ‌ర్ స్క్రీన్‌పై ప్రెజంట్ చేస్తున్నారు. ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత పూరీ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో లైగర్‌పై భారీ అంచ‌నాలున్నాయి. లైగర్ ద్వారా బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే .. టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు.

More News

పార్టీ మారతారంటూ వార్తలు.. ప్రాణం వున్నంత వరకు జగన్‌తోనే అన్న రోజా

ఆర్కే రోజా... హీరోయిన్‌గా దక్షిణాదిలో ఓ వెలుగు వెలిగిన ఈ భామ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించింది.

కొంపముంచిన ప్రమోషన్ వీడియో... చిక్కుల్లో బిగ్‌‌బాస్ ‘‘సరయూ’’

యూట్యూబ్ స్టార్ 7ఆర్ట్స్‌ సరయు గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇక సెలవ్.. అధికారిక లాంఛనాలతో ముగిసిన లతా మంగేష్కర్ అంత్యక్రియలు

అనారోగ్యంతో మరణించిన దిగ్గజ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో ముగిశాయి.

ముచ్చింతల్‌లో సమతామూర్తిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్.. ఆ అర్హత మోడీదేనంటూ వ్యాఖ్యలు

హైదరాబాద్ ముచ్చింతల్‌ చినజీయర్ ఆశ్రమంలో సమతామూర్తి రామానుజుల వారి 216 అడుగుల విగ్రహాన్ని దర్శించుకున్నారు

స్లో పాయిజిన్‌తో లతాజీ హత్యకు కుట్ర: వంటమనిషి మాయం, నేటికీ మిస్టరీయే..!!

దిగ్గజ గాయని లతా మంగేష్కర్ మరణంతో దేశం మూగబోయింది. లతాజీ నిష్క్రమణతో భారతీయ సంగీత ప్రపంచంలో ఓ అధ్యాయం ముగిసినట్లయ్యింది.