పూరితో ప‌వ‌ర్‌స్టార్‌..?

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. ఇప్ప‌టికే వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, బోనీ క‌పూర్ నిర్మాత‌లుగా 'పింక్' రీమేక్ 'వ‌కీల్ సాబ్‌' సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇది కాకుండా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా.. హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా లైన్‌లో పెట్టాడు. ఇవి కాకుండా.. మ‌రికొన్ని సినిమాలకు సంబంధించిన క‌థ‌లు వింటున్న‌ట్లు స‌మాచారం.

సినీ వ‌ర్గాల్లో విన‌ప‌డుతున్న స‌మాచారం మేర‌కు హ‌రీశ్ శంక‌ర్ త‌ర్వాత డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నార‌ని టాక్‌. దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో ఈ సినిమాను తెర‌కెక్కించాలనేది ప్లాన్‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఆస‌క్తి చూపిస్తున్నారని స‌మాచారం. బద్రి, కెమెరామెన్ గంగ‌తో రాంబాబు సినిమాలు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందాయి. అంతా ఓకే అయితే వీరి కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీ అవుతుంది. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండంతో పూరి జ‌గ‌న్నాథ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్త‌యిన త‌ర్వాతే ప‌వ‌న్‌తో సినిమా తెర‌కెక్కే అవ‌కాశం ఉంద‌ని టాక్‌. అంటే 2021లో ప‌వ‌న్‌, పూరి కాంబినేష‌న్‌లో సినిమా తెర‌కెక్కే అవ‌కాశం ఉంద‌ట‌.