పూరికి వ్యతిరేకంగా తేజ....
- IndiaGlitz, [Wednesday,April 20 2016]
పూరి జగన్నాథ్ - లోఫర్ డిస్ట్రిబ్యూటర్స్ వివాదం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. సినిమా అనేది కళాత్మకమైన వ్యాపారం. డిస్ట్రిబ్యూటర్ కి లాభాలు వస్తే..ప్రొడ్యూసర్ కి కానీ డైరెక్టర్ కి కానీ ఆ లాభాలు పంచనప్పుడు లాస్ వస్తే వీళ్లు ఎందుకు డబ్బులు ఇవ్వాలి..? అయినా డిస్ట్రిబ్యూటర్ నిర్మాత దగ్గర సినిమాను కొంటే డైరెక్టర్ కి సంబంధం ఏముంటుంది..? అంటూ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్ తో పాటు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు పూరి జగన్నాథ్ కు మద్దతు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే... డైరెక్టర్ తేజ ఒక డైరెక్టర్ అయ్యుండి పూరికి సపోర్ట్ చేయకుండా డిస్ట్రిబ్యూటర్స్ కి మద్దతు తెలియచేస్తుండడం విశేషం.
ఈ వివాదం గురించి డైరెక్టర్ తేజ స్పందిస్తూ... ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవికి పర్మినెంట్ ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఉండేవారు. ఒకరి కష్టనష్టాలను మరొకరు పంచుకునేవారు. ప్రస్తుతం తెలుగులో ఏ హీరోకు పర్మినెంట్ ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ లేరు.సినిమాలో నష్టం వస్తే...డైరెక్టర్, హీరో డబ్బులు వెనక్కి ఇవ్వాలి. డైరెక్టర్ డబ్బులు వెనక్కివ్వడం అనేది నా ధైర్యం సినిమాతోనే మొదలైంది. సినిమా ఆడకపోతే డబ్బులు వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది అంటే డైరెక్టర్స్, హీరోలు ఒళ్లు దగ్గర పెట్టుకుని సరైన కథలతో సినిమాలు తీస్తారు. డిస్ట్రిబ్యూటర్స్ డబ్బులు వెనక్కి ఇవ్వమనడం శుభపరిణామం.నాకు నచ్చింది అని అంటున్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని సరైన కథలతో సినిమాలు తీయాలని వేరే డైరెక్టర్స్ కి నీతులు చెప్పే ముందు తేజ సరైన కథలతో సినిమాలు తీసి సక్సెస్ సాధించి ఆతర్వాత చెబితే బాగుంటుందేమో..కాస్త ఆలోచించండి తేజ గారు...