ట్రయినింగ్ తీసుకుంటున్న పూరి తనయుడు....

  • IndiaGlitz, [Thursday,January 05 2017]

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌నయుడు ఆకాష్ ఇప్పుడు హీరోగా తెరంగేట్రం చేయ‌డానికి అన్ని విధాలుగా సిద్ధ‌మ‌వుతున్నాడు. బాల‌న‌టుడిగా ఎన్నో చిత్రాల్లో న‌టించిన ఆకాష్ పూరి పూర్తి స్థాయి హీరో కానున్నాడు. ఇదే విష‌యాన్ని పూరి జ‌గ‌న్నాథ్‌ను అడిగితే అందుకు స‌మ‌యం ఉంద‌ని, ఆకాష్‌ను ట్ర‌యినింగ్‌కు పంపుతున్నాన‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగానే ఆకాష్ థాయ్‌లాండ్‌లో 45రోజుల మువై థాయ్ అనే స్పోర్ట్ కోర్సును నేర్చుకుంటున్నాడు. స్పెష‌ల్ డైట్‌ను తీసుకుంటున్నాడ‌ట‌. ట్ర‌యినింగ్ తీసుకున్న త‌ర్వాత ఆకాష్ ఎనిమిది కిలోలు బ‌రువు త‌గ్గాడు. ఈ శిక్ష‌ణ పూర్త‌యిన త‌ర్వాత జూలై నుండి న్యూయార్క్ ఆకాడ‌మీలో రెండేళ్ల కోర్సులో జాయిన్ అవుతాడ‌ట ఆకాష్‌....

More News

నాని నేను లోక‌ల్ ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్..!

నేచర‌ల్ స్టార్ నాని హీరోగా సినిమా చూపిస్త మావ ఫేమ్ న‌క్కిన త్రినాధ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌ చిత్రం నేను లోక‌ల్. ఈ చిత్రానికి అటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనేది క్యాప్ష‌న్. ఈ చిత్రం శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందింది.

అనంత‌పురంలో రానా..!

ద‌గ్గుబాటి రానా హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు 50% షూటింగ్ పూర్తి చేసుకుంది.

నారా రోహిత్ పై ఐటీ దాడి..!

ఇటీవల బాహుబలి నిర్మాతల పై ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే.

ఖైదీ నెం 150 నుంచి తీసేసినందుకు బాధపడుతున్న కమెడియన్..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన150వ చిత్రం ఖైదీ నెం 150.

నాగ్ లేటెస్ట్ రికార్డ్..!

టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం ఓం నమో వేంకటేశాయ చిత్రంలో నటించారు.