చిరు 150వ సినిమా నేనే చేస్తానంటున్న పూరి
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి చాలా రోజులు నుంచి వార్తలు వస్తున్నాయి.కానీ.. సినిమా సెట్స్ పైకి వెళ్లడం లేదు. కారణం కథ కుదరక పోవడం..డైరెక్టర్ ఫైనల్ కాకపోవడం. అయితే ఇటీవల పూరి జగన్నాధ్ మీడియాతో మాట్లాడుతూ..చిరంజీవి గారు నేను చెప్పిన కథలో సెకండాఫ్ నచ్చలేదని నాతో చెప్పలేదు. మీడియాతో చెప్పారు. నాతో చెప్పి ఉంటే నచ్చేట్టు మార్పులు చేసేవాడిని అన్నారు. పూరి వ్యాఖ్యలు బట్టి బాగా హార్ట్ అయ్యాడని తెలుసుకున్నచిరు చరణ్ ని రంగంలోకి దింపారు.
పూరిని పుట్టినరోజు నాడు చరణ్ కలసి బర్త్ డే విషెష్ చెప్పి నాన్న గారి 150 సినిమా డైరెక్టర్స్ లిస్ట్ లో మీరు కూడా ఉన్నారు అని చరణ్ చెప్పాడట. అందుకనే అనుకుంట పూరి ట్విట్టర్ లో చిరంజీవి గారి 150వ సినిమాని నేనే డైరెక్ట్ చేస్తా. ఆయనకు నేను పెద్ద ఫ్యాన్ ను. చిరంజీవిగారిని ఎలా చూపించాలో నాకు తెలిసినట్టు చిరంజీవిగారికి కూడా తెలియదు. 150 సినిమా కాకపోతే...151 వ సినిమా చేస్తా..ఎప్పటికైనా చిరంజీవిగారితో సినిమా చేయాలన్నదే నా కోరిక అంటూ ట్విట్టర్ లో తన మనసులో మాట చెప్పాడు పూరి. చిరుతో సినిమా చేయాలన్న పూరి కోరిక త్వరలోనే తీరాలని కోరుకుందాం..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments