నేను ఎవరి కోసం ఎదురు చూడను - పూరి జగన్నాథ్..
Wednesday, October 19, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
కమర్షియల్ సినిమాకు కేరాఫ్ అడ్రస్ అంటే పూరి...! హీరోలను సరికొత్తగా చూపించే డైరెక్టర్ అంటే పూరి..! తక్కువ టైమ్ లో ఎక్కువ సినిమాలు చేసే స్పీడు డైరెక్టర్ అంటే పూరి..! అన్నింటికి మించి ఆత్మవిశ్వాసానికి మరో పేరు అంటే పూరి..! ఇలా పూరి గురించి ఎంత చెప్పినా తక్కువే..! ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ తీసిన పూరి తాజాగా తెరకెక్కించిన చిత్రం ఇజం. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఇజం చిత్రం ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా ఇజం గురించి పూరితో స్పెషల్ ఇంటర్ వ్యూ మీకోసం..!
ఇజం కథ ఏమిటి..?
ఇజం ఓ జర్నలిస్ట్ కథ. సమాజంలో ఉన్న అవినీతి పై ఓ జర్నలిస్ట్ చేసే పోరాటం. జనరల్ గా ఇలాంటి సినిమాల్లో క్లైమాక్స్ లో విలన్ ని చంపేసినట్టు చూపిస్తారు కానీ సమస్యకు పరిష్కారం చూపించరు. కాని మా సినిమాలో సమస్యకు పరిష్కారం చూపించాను. అది ఏమిటి అనేది తెలియాలంటే ఇజం చూడాల్సిందే..!
కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా కూడా జర్నలిజం కథాంశమే కదా...ఈ సినిమాతో పోలికలు ఏమైనా ఉన్నాయా..?
అది వేరు ఇది వేరు అసలు ఆ సినిమాతో సంబంధమే లేదు.
ఇజం కథ ఎలా పుట్టింది..?
సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆదారంగానే ఇజం కథ రాసాను. ఈ కథను ఇప్పుడు కాదు. పది సంవత్సరాల క్రితమే రాసాను. ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టు మార్పులు చేసాను.
కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది.?
కళ్యాణ్ రామ్ వెబ్ మీడియా జర్నలిస్ట్ గా నటించాడు. సత్యా మార్తాండ్ అనేది కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ పేరు. పాత్రకు తగ్గట్టుగా అద్భుతంగా నటించాడు. ఈ చిత్రంలో హీరో ఎవరికీ క్లాస్ పీకడు. తను చెప్పాలనుకున్నది చెబుతాడు. ఈ చిత్రంలో నటించడం కో్సం 13 కేజీలు తగ్గాడు అంటే ఎంత హార్డ్ వర్క్ చేసాడో అర్ధం చేసుకోవచ్చు. కళ్యాణ్ రామ్ పెర్ ఫార్మెన్స్ కు అవార్డ్ వస్తుంది అనుకుంటున్నాను.
మీరు హీరోలతో సిక్స్ ప్యాక్ చేయిస్తుంటారు కదా..! సిక్స్ ప్యాక్ చేస్తే బాగుంటుంది అని మీరు చెబుతారా..? లేక మీతో సినిమా చేసే హీరోలే సిక్స్ ప్యాక్ చేస్తాం అంటారా..?
నాతో సినిమా అంటే ఏ హీరోని అయినా నేను కొత్తగా చూపిస్తాను అని ఆశిస్తారు. నా సినిమాలో హీరో అంటే తన గత చిత్రాలకంటే భిన్నంగా ఉండాలి అనుకుంటాను. అందుకనే కళ్యాణ్ రామ్ తో సిక్స్ ప్యాక్ చేయించాను.
ఇజం అంటే పూరిఇజమా..?
జర్నలిజం...పూరిఇజం ఎలా అనుకున్నా ఓకే...!
పూరితో సినిమా అంటే కథ ఏమిటి అని అడగకుండా సినిమా చేసేస్తాను అని జగపతిబాబు అన్నారు. బాచి తర్వాత జగపతిబాబుతో సినిమా చేసారు కదా..! ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
నాకు జగపతిబాబు అంటే ఇష్టం. ఈ సినిమాలో ఆయన డాన్ గా నటించారు. ఆయన క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుంది.
ఆదితి ఆర్యను హీరోయిన్ గా పరిచయం చేసారు కదా..! ఆమె క్యారెక్టర్ గురించి..?
ఆదితి ఆర్య మిస్ ఇండియాగా ఎంపికై అమ్మాయి. ఈ చిత్రంలో డాన్ గా నటించిన జగపతిబాబు కూతురుగా నటించింది. ఈ క్యారెక్టర్ కోసం చాలా కష్టపడింది. తెలుగు నేర్చుకుని డైలాగులు చెప్పేది. ఖచ్చితంగా పెద్ద హీరోయిన్ అవుతుంది.
ఈ చిత్రంలో పాట రాయడంతో పాటు పాడారు కదా..? పాట రాయడం ఎలా అనిపించింది..?
అనూప్ పట్టుబట్టడంతో పాట రాయడంతో పాటు పాడాను. పాట రాయడం చాలా కష్టం అనిపించింది.
హిందీలో ఓ సినిమా చేయాలి అనుకున్నారు కదా...ఏమైంది..?
టెంపర్ సినిమాని అభిషేక్ బచ్చన్ తో చేయాలి అనుకున్నాను. కథ చెప్పాను ఎన్టీఆర్ రేంజ్ ఏక్టింగ్ చేయలేను అన్నాడు.
మహేష్ తో జనగణమణ సినిమా ఎనౌన్స్ చేసారు కదా..! ఎప్పుడు ప్రారంభం..?
మహేష్ కి కథ చెప్పాను నచ్చింది అన్నాడు. కానీ...ఆతర్వాత మహేష్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.
మహేష్ కి పోకిరి, బిజినెస్ మేన్ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చినా...మీతో సినిమా చేయడానికి ఇప్పుడు ముందుకు రాకపోవడం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంటుంది..?
కథ చెప్పాను నచ్చింది అన్నాడు కానీ అటు నుంచి రెస్పాన్స్ రాలేదు. నేను ఎవరి కోసం ఎదురు చూడను. మన వలన ఎదుటి వ్యక్తి టైమ్ వేస్ట్ అవ్వకూడదు అని ఆలోచించాలి. జనగణమన సినిమా అయితే చేస్తాను. ఎప్పుడు అవుతుందో చూడాలి.
చాలా ఫాస్ట్ గా స్ర్కిప్ట్ రాసేస్తారు కదా..! అసలు మీ కథలు ఎలా పుడుతుంటాయి..?
సమాజంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే చాలా కథలు వస్తుంటాయి. నా దగ్గర ఓ పది సంవత్సరాలకు సరిపడా కథలు ఉన్నాయి.
ఫ్లాప్స్ , హిట్స్, ఇండస్ట్రీ హిట్స్...ఇలా సినిమాలు చేసారు కదా..! డైరెక్టర్ గా మీ గోల్ ఏమిటి..?
మన ఏక్టర్స్ ని హాలీవుడ్ ఏక్టర్స్ ని కలిపి సినిమాలు చేయాలి అనుకుంటున్నాను.
గతంలో ప్రొడ్యూసర్ గా వరుసగా సినిమాలు తీస్తాను అన్నారు కదా...?
మన దగ్గర టాలెంట్ ఉన్న వాళ్లు చాలా మంది ఉన్నారు. పూరి కనెక్ట్ ద్వారా టాలెంట్ ఉన్న వాళ్లను సెలెక్ట్ చేస్తున్నాం. వాళ్ళతో కొత్త తరహా సినిమాలు ప్లాన్ చేస్తున్నాను.
పూరి అంటే... రఫ్ గా ఉంటాడు అనుకుంటారు కానీ...మీలో ఉన్న సున్నితత్వం గురించి కొంత మందికే తెలుసు..! మీ మనసుకు తగ్గట్టుగా సున్నితమైన ప్రేమకథా చిత్రం తీయచ్చు కదా..?
నాకు తీయాలని ఉంది. ఓ లవ్ స్టోరీ రాసాను. తప్పకుండా లవ్ స్టోరీ తీస్తాను.
మీ సినిమాల గురించి చెప్పమంటే...చాలా మంది ఫస్ట్ చెప్పే సినిమా అమ్మ నాన్న ఓ తమిళ. ఇలాంటి సినిమా ఎప్పుడు..?
అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి ఓ డిఫరెంట్ స్టోరీ రెడీ చేసాను. రోగ్ హీరోతో ఈ సినిమా తీస్తున్నాను. నా సొంత బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను.
ఆత్మవిశ్వాసానికి మరో పేరు అంటే పూరి. మిమ్మల్ని గుర్తు చేసుకుంటే చాలు ఎనర్జి వస్తుంటుంది. మరి...మీకు ఎనర్జి రావాలంటే ఏం చేస్తుంటారు..?
హిట్ వస్తే...ఓకే హిట్ వచ్చింది అనుకుంటాను అలాగే ఫ్లాప్ వచ్చినా సరే ఫ్లాప్ వచ్చింది అనుకుంటాను. అంతే కానీ దాని గురించి ఎక్కువుగా ఆలోచించను. ఎప్పుడైనా బ్యాడ్ ఏదైనా జరిగినా ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఆ విషయం మరచిపోయి వేరే దాంట్లోకి వెళ్లిపోతాను. అదే నా ఎనర్జి అనుకుంటాను.
రోగ్ సినిమా ఎంత వరకు వచ్చింది..?
షూటింగ్ పూర్తయ్యింది. డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.
నెక్ట్స్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నారు కదా..? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది..?
ప్రస్తుతానికి ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. ఇంకో వారం తర్వాత తెలుస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments