ఇష్టమైన పనికోసం చావండి: పూరీ
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి కమ్ నిర్మాత ఛార్మి ఇద్దరూ కలిసి అవకాశాల్లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న 30 మంది దర్శకులు, సహాయ దర్శకులకు ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చి పెద్ద మనసు చాటుకున్నారు. సెప్టెంబర్-28 పూరీ జగన్నాథ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘పీసీ హెల్పింగ్ హ్యాండ్స్’ అనే కార్యక్రమానికి ఈ ఇద్దరు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో చార్మీ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అంతేకాదు.. ఈ ఇద్దరు పడ్డ ఆర్థిక పరిస్థితులను కూడా ఈ వేదికగా ఛార్మి పంచుకుంది. ఇస్మార్ట్ శంకర్‌కు ముందు మా దగ్గర రూ.50వేలు కూడా లేవని.. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పింది. అయితే ఇప్పుడు.. 30 మంది దర్శకులకు గాను అదే రూ. 50వేలు రూపాయిలు ఇస్తున్నామని తెలిపింది. అలా ఒకరి కష్టాలు ఒకరం చెప్పుకుంటూ తాను, పూరీ ఇద్దరం మంచి స్నేహితులమయ్యామని చార్మీ చెప్పుకొచ్చింది.
నా దృష్టిలో నిజమైన సక్సెస్ అంటే..!
ఈ సందర్భంగా పూరీ పంపిన ఓ సందేశాన్ని చదివి వినిపించింది. ఈ సందేశం చాలా లాజికల్‌గా, తన సినిమా డైలాగ్స్‌లో లాగా ఉంది. ‘మనమంతా ఏదో సాధించాలని పరుగులు తీస్తుంటాం.. తపన పడుతుంటామని అయితే ఇందులో కొందరు మాత్రమే స్టార్స్ అవుతారని.. ఇంకొందరు మాత్రం కాలేరు. అయితే స్టార్స్ అయిన వాల్లంతా సక్సెస్ అయినట్లు.. కాని వాళ్లంతా ఫెయిల్ అయినట్లు కాదు. నా దృష్టిలో నిజమైన సక్సెస్ అంటే.. నీకు ఇష్టమైన పనికోసం కష్టం వచ్చినా.. నష్టం వచ్చినా.. దాని కోసం చావడమే సక్సెస్. అందులో మనకు రూపాయి రావచ్చు.. కోటి రూపాయిలు రావచ్చు. ఇష్టమైన పనికోసం చావండి’ అని పూరీ పంపిన సందేశాన్ని ఛార్మి చదివి వినిపించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout