అనుష్క అసలు పేరేంటో తెలుసా?... పేరు వెనుక సీక్రెట్ చెప్పిన పూరి

  • IndiaGlitz, [Friday,March 13 2020]

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకున్న అనుష్క శెట్టి అసలు పేరు స్వీటీ. ఈమె ‘సూపర్’ సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసింది. ఆ సినిమా సమయంలో డైరెక్టర్ పూరీని కలిసినప్పుడు ఆమె పేరు స్వీటీ అని చెప్పగానే నేను అడిగింది ముద్దు పేరు కాదు.. అసలు పేరు చెప్పమని అని అన్నాట్ట. దానికి అనుష్క తన అసలు పేరే స్వీటీ శెట్టి అని తన పాస్ పోర్ట్ కూడా చూపించిందట. ఈ విషయం తెలిసిన ‘సూపర్’ హీరో నాగార్జున స్వీటీ పేరుని మార్చాలని పూరీకి చెప్పాడట. దాంతో పూరి చాలా పేర్లను పరిశీలిస్తున్న క్రమంలో ‘సూపర్’ సినిమాలో ‘మిల మిల మెరిసన కనులకు ఎందుకో ..’ పాట పాడటానికి వచ్చిన అమ్మాయి పేరు అనుష్క అని పూరీకి తెలిసింది. ఆ పేరు బావుందనిపించడంతో నాగార్జునకి చెప్పాడట పూరి. అనుష్క అనే పేరు చాలా తక్కువ మందికి ఉంటుందని కాబట్టి.. అదే పేరుని ఖరారు చేయమని పూరీకి చెప్పాడట నాగార్జున. అలా స్వీటీ పేరు కాస్త అనుష్కగా మారింది.

ఈ ఏడాది అనుష్క కెరీర్‌ను స్టార్ట్ చేసి అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘నిశ్శబ్దం’ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కానుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అనుష్కతో పాటు మాధవన్, అజంలి, షాలిని పాండే, సుబ్బరాజ్, మైకేల్ హడ్సన్ తదితరులు నటిస్తున్నారు. క్రాస్ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.

More News

ర‌ష్య‌న్ డ్రైవ‌ర్ కోసం అనుష్క ఏం చేసిందో తెలుసా?

అనుష్క ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లు అవుతుంది. ఈ ఏడాది ఆమె న‌టించిన నిశ్శ‌బ్దం సినిమా కూడా విడుద‌ల‌వుతుంది.

బ‌న్నీ సినిమాకు క‌రోనా ఎఫెక్ట్‌... లొకేష‌న్ చేంజ్‌

టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రైన బ‌న్నీ ఇప్పుడు సుకుమార్ సినిమా కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు.

బాల‌య్య ఎటు వైపు మొగ్గుతాడు?

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం త‌న 106వ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుం సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జ‌రుగుతుంది.

ఇంత‌మంది అభిమానుల‌ను సంపాదించుకున్న అనుష్క‌ జ‌న్మ ధ‌న్యం: రాఘ‌వేంద్ర‌రావు

2005 సంవ‌త్స‌రంలో వ‌చ్చిన 'సూప‌ర్' సినిమాతో ప్రారంభించి న‌టిగా అనుష్క ప్ర‌యాణానికి 15 సంవ‌త్స‌రాలు.

రేవంత్‌కు అధ్యక్ష పదవి కష్టమే.. తొక్కేస్తున్నారే..!?

రేవంత్ రెడ్డి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.. పరిచయం చేయాల్సిన అవసరం అంతకంటే లేదు.