చిరంజీవి, నాగబాబు గర్వపడేలా వరుణ్ తేజ్ సినిమాలు చేస్తాడు - పూరి జగన్నాథ్
Send us your feedback to audioarticles@vaarta.com
'ముకుంద', 'కంచె' వంటి విభిన్న కథా చిత్రాల్లో హీరోగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని ఏర్పరుచుకున్న మెగాబ్రదర్ నాగబాబు తనయుడు సుప్రీమ్ హీరో వరుణ్ తేజ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లిమిటెడ్ సి.కళ్యాణ్ సమర్పణలో శ్రీశుభశ్వేత ఫిలింస్ పతాకంపై సి.వి.రావు, శ్వేతలానా, వరుణ్, తేజ నిర్మిస్తున్న భారీ చిత్రం 'లోఫర్‌స. సినిమా డిసెంబర్ 17న విడుదలై మంచి కలెక్షన్స్‌ను సాధిస్తుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా
పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ''సినిమా ఫస్ట్ కాపీ చూసిన తర్వాత కళ్యాణ్‌గారు ఫోన్ చేసి మంచి సినిమా తీశావని అన్నారు. సినిమాలో మదర్ సెంటిమెంట్‌కు ఆడియెన్స్‌నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. మహిళా ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరిస్తున్నారు. వరుణ్ ముకుంద, కంచె తర్వాత లోఫర్. ఈ మూడు సినిమాల్లో డిఫరెంట్ పాత్రలను చేసి ఏ క్యారెక్టర్ అయినా చేయగలనని ప్రూవ్ చేసుకున్నాడు. భవిష్యత్‌తో చిరంజీవిగారు, నాగబాబుగారు గర్వపడేలా సినిమాలు చేస్తాడు. రేవతి, పోసానిల నటనకు మంచి అప్లాజ్ వచ్చింది. హీరోయిన్ దిశాపటాని కోసం ఇప్పటికే చాలా మంది నిర్మాతలు ఫోన్ చేస్తున్నారు. తను అప్పుడే స్టార్ హీరోయిన్ అయిపోయింది. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు థాంక్స్'' అన్నారు.
సి.కళ్యాణ్ మాట్లాడుతూ ''మంచి సినిమా తీశానని అందరూ మెచ్చుకుంటున్నారు. మంచి సినిమాను నాకు ఇచ్చినందుకు పూరి అన్నయ్యకు థాంక్స్.మాస్ లుక్‌లో కనపడుతూ వరుణ్ చాలా బాగా నటించాడు. రెండు భారీ హిందీ సినిమాల మధ్య నైజాంలో 240 థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమాకు కలెక్షన్స్ స్టడీగా వస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ నాకు ఫోన్ చేసి ఆనందాన్ని తెలియజేస్తున్నారు. సునీల్ కశ్యప్ గ్రేట్ మ్యూజిక్ ఇచ్చారు. ముఖ్యంగా సువ్వి సువ్వాలమ్మా..సాంగ్‌కు మంచి అప్రిసియేషన్ వస్తుంది. సెకండాఫ్‌లో మదర్ సెంటిమెంట్ బావుందని అందరూమెచ్చుకుంటున్నారు. దిశాపటాని వంటి హీరోయిన్‌ను తెలుగు తెరకు ఈసినిమాతో పూరి పరిచయం చేశారు. మంచి సినిమాను ఇచ్చిన టీం, సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్'' అన్నారు.
వరుణ్ తేజ్ మాట్లాడుతూ ''చాలా మంది ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఆడియెన్స్ నాకు ఫోన్ చేసి మంచి సినిమా చేశావని మెచ్చుకుంటున్నారు. ఇంత మంచి సినిమాను నాకు ఇచ్చిన పూరి, కళ్యాణ్‌గారికి థాంక్స్. ప్రేక్షకులకు ధన్యవాదాలు'' అన్నారు.
దిశాపటాని మాట్లాడుతూ ''ఇంత మంచి సినిమాలో పార్ట్ అయినందుకు హ్యపీగా ఉంది. పూరిగారు ఓ ఫ్రెండ్‌లా నాకు సినిమా గురించి చెప్పారు. అలాగే వరుణ్ ఓ టీచర్‌లా నాకు సపోర్ట్ చేశారు. వరుణ్ ఫ్యూచర్‌లో పెద్ద స్టార్ అవుతాడు'' అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సునీల్ కశ్యప్, విఠల్, వంశీ,రమ్య, సి.వి.రావు, బి.ఎ.రాజు, భద్రమ్, విజయ్ మాస్టర్ తదితరులు పాల్గొని సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు దన్యవాదాలు తెలియజేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments