మెగా హీరో కోసం పూరీ పొలిటికల్ సబ్జెక్ట్?
Send us your feedback to audioarticles@vaarta.com
'పోకిరి' వంటి సంచలన విజయంతో టాక్ ఆఫ్ టాలీవుడ్ అయ్యారు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. గత కొంతకాలంగా విజయాలకు దూరంగా ఉన్న పూరీ.. ప్రస్తుతం తన కొడుకు పూరీ ఆకాశ్ హీరోగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 'మెహబూబా' పేరుతో పునర్జన్మల నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో.. 1971 ఇండో - పాక్ వార్ నేపథ్యంలో ఓ జన్మ ప్రేమకథను తీర్చిదిద్దారు. ఇప్పటికే ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా మే 11న విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తరువాత పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో పూరీ ఓ సినిమా తీయనున్నారని టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఓ మెగా హీరో నటించే అవకాశముందని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ కోసం రామ్ చరణ్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలుస్తోంది. చరణ్‌తో కుదరకపోతే వరుణ్ తేజ్ సినిమా చేయాలన్నది పూరీ ఆలోచనగా ఆయన సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ వస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com