రాజమౌళి తండ్రి ఫోన్ లో పూరి ఫోటో.. షాకింగ్ రీజన్, నీ రేంజ్ ఇది అంటూ కొరటాల..
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కు ప్రత్యేక స్థానం ఉంది. పూరి శైలిని ఇష్టపడే వారు చాలా మందే ఉన్నారు. పూరి ఇండస్ట్రీలో నిర్మాతల దర్శకుడు అనే మంచి పేరు ఉంది. త్వరగా కథలు రాసుకోవడం అంతే త్వరగా షూటింగ్ పూర్తి చేసి క్వాలిటీ అవుట్ పుట్ తీసుకురావడంలో పూరి తర్వాతే ఎవరైనా. అందుకే ఆయన్ని మినిమమ్ గ్యారెంటీ డైరెక్టర్ అని అంటారు.
పూరి జగన్నాధ్ కు రాజమౌలి కూడా అభిమానే. గతంలో బిజినెస్ మ్యాన్ మూవీ టైంలో రాజమౌళి పూరి జగన్నాధ్ పై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. పూరి అభిమానుల లిస్ట్ లో రాజమౌళి తండ్రి కూడా చేరారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కొంచెం ఘాటుగా పూరి అంటే నాకు అసూయ అని కామెంట్ చేశారు.
ఇదీ చదవండి: స్టన్నింగ్ హాట్.. నడుము సొగసుతో మంత్రం వేస్తోంది
అలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఓ టివి షోకి విజయంద్ర ప్రసాద్ హాజరయ్యారు. ఈ షోలో విజయేంద్ర ప్రసాద్ పూరి గురించి ఇలా కామెంట్ చేసారు. రాజమౌళి కాకుండా మీకు ఇష్టమైన దర్శకుడు ఎవరు అని అలీ ప్రశ్నించగా.. విజయేంద్ర ప్రసాద్ వెంటనే పూరి జగన్నాధ్ అని తెలిపారు. ఆయనంటే నాకు అసూయ. మీకు ఒక షాకింగ్ విషయం చెప్పాలి అంటూ తన ఫోన్ లో పూరి ఫోటోని వాల్ పేపర్ గా పెట్టుకున్నట్లు విజయేంద్రప్రసాద్ తెలిపారు. ఫోన్ ని ఆలీకి చూపించారు.
నా శత్రువుని నేను రోజూ చూస్తూ ఉండాలి. అందుకే పూరి ఫోటో వాల్ పేపర్ గా పెట్టుకున్నట్లు విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇది ఒక ఎత్తైతే ఆ వీడియో బైట్ ని ట్వీట్ చేస్తూ కొరటాల శివ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. 'నీ రేంజ్ ఇది పూరి జగన్నాధ్' అని ట్వీట్ చేశాడు.
తన స్క్రిప్ట్ పట్ల పూర్తి క్లారిటీతో ఉండే దర్శకుల్లో పూరి జగన్నాధ్ ఒకరు. స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత షూటింగ్ ని పరుగులు పెట్టిస్తారు. అలాగని ఆయన సినిమాలు నాసిరకంగా ఉండవు. మంచి అవుట్ పుట్ తో వస్తాయి. పూరికి ప్లాపులు ఉన్నప్పటికీ అవి ఇతర కారణాల వల్ల ఎదురైన పరాజయాలు. అంతేకాని పూరి దర్శత్వంలో ఎలాంటి లోపం ఉండదు.
Nee range idi @purijagan pic.twitter.com/i0MfP8Wfws
— ?? (@Koratala_fan) May 27, 2021
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments