పూరి-ఎన్టీఆర్ మూవీ అప్ డేట్..

  • IndiaGlitz, [Monday,April 04 2016]

డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ - యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వీరిద్ద‌రి కాంబినేష‌న్లో రూపొందిన ఆంధ్రావాలా ఆశించిన విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. ఆత‌ర్వాత పూరి - ఎన్టీఆర్ క‌ల‌సి చేసిన రెండో చిత్రం టెంప‌ర్. ఈ చిత్రం వ‌రుస ఫ్లాప్స్ తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఎన్టీఆర్ కి విజ‌యాన్ని అందించింది. మ‌ళ్లీ వీరిద్ద‌రు క‌ల‌సి మూడో చిత్రం చేయ‌డానికి రెడీ అవుతున్నారు.
ఈమ‌ధ్య‌ పూరి... క‌ళ్యాణ్ రామ్ - ఎన్టీఆర్ వీరిద్ద‌రికి రెండు క‌థ‌లు ఒకేరోజు చెప్పి ఒప్పించార‌న్న విష‌యం తెలిసిందే. నంద‌మూరి హీరోల‌తో పూరి చేయ‌నున్న ఈ రెండు చిత్రాల లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే.. క‌ళ్యాణ్ రామ్ తో చేయ‌నున్న చిత్రాన్ని మేలో ప్రారంభించ‌నున్నారు. ఎన్టీఆర్ తో చేయ‌నున్న సినిమా కోసం స్ర్కిప్ట్ వ‌ర్క్ స్టార్ట్ చేసారు పూరి. ప్ర‌స్తుతం పూరి బ్యాంకాక్ లో ఎన్టీఆర్ సినిమా స్ర్కిప్ట్ వ‌ర్క్ చేస్తున్నారు. ఎన్టీఆర్ - పూరి కాంబినేష‌న్లో రూపొందే చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్. ప్ర‌సాద్ నిర్మించ‌నున్న‌ట్టు స‌మాచారం.