బాలయ్యను పూరి ఇప్పుడు మిస్ కావట్లేదు!
Send us your feedback to audioarticles@vaarta.com
నిన్న,మొన్నటి వరకు 'పైసా వసూల్' టీమ్ టీమంతా బాలయ్యను చూసిన ప్రతి సారీ.. కోకోకోలా పెప్సీ బాలయ్యబాబు సెక్సీ అని, మిస్ యు బాలయ్యా అని, లవ్ యూ బాలయ్యా అని, బాలయ్యతో లవ్లో ఉన్నామని రకరకాలుగా చెబుతూనే ఉన్నారు.
ఈ సినిమా విడుదలైన పైసావసూల్ బాలయ్య అభిమానులకు కొత్త పండుగ తెచ్చి సందడి చేసింది. ఆ సినిమాను పూరి జగన్నాథ్ తీసిన వేగం చూసిన బాలయ్య ఆశ్చర్యపోయారట. తాజాగా పూరితో మరో సినిమా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఈ సారి పూరి జగన్నాథ్ చెప్పిన కథ కూడా నచ్చిందట.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. సంక్రాంతికి పూరి దర్శకత్వంలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తాజాగా బాలకృష్ణ 102 సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. వచ్చేనెల్లో 103 మొదలవుతుంది. మొన్నామధ్య పైసా వసూల్ ఆడియో వేడుకలో చెప్పినట్టు బాలయ్య ఇప్పుడు ఫ్రెష్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినంత స్పీడ్ మీద ఉండటం ఆయన అభిమానుల్లో గర్వాతిశయాన్ని ఉప్పొంగిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments