బాల‌య్య‌ను పూరి ఇప్పుడు మిస్ కావ‌ట్లేదు!

  • IndiaGlitz, [Tuesday,September 05 2017]

నిన్న‌,మొన్న‌టి వ‌ర‌కు 'పైసా వ‌సూల్‌' టీమ్ టీమంతా బాల‌య్య‌ను చూసిన ప్ర‌తి సారీ.. కోకోకోలా పెప్సీ బాల‌య్య‌బాబు సెక్సీ అని, మిస్ యు బాల‌య్యా అని, ల‌వ్ యూ బాల‌య్యా అని, బాల‌య్య‌తో ల‌వ్‌లో ఉన్నామ‌ని ర‌క‌ర‌కాలుగా చెబుతూనే ఉన్నారు.

ఈ సినిమా విడుద‌లైన పైసావ‌సూల్ బాల‌య్య అభిమానుల‌కు కొత్త పండుగ తెచ్చి సంద‌డి చేసింది. ఆ సినిమాను పూరి జ‌గ‌న్నాథ్ తీసిన వేగం చూసిన బాల‌య్య ఆశ్చ‌ర్య‌పోయార‌ట‌. తాజాగా పూరితో మ‌రో సినిమా చేయ‌డానికి కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ట‌. ఈ సారి పూరి జ‌గ‌న్నాథ్ చెప్పిన క‌థ కూడా న‌చ్చింద‌ట‌.

ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. వ‌చ్చే అక్టోబ‌ర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొద‌లు కానుంది. సంక్రాంతికి పూరి ద‌ర్శ‌క‌త్వంలో సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. తాజాగా బాల‌కృష్ణ 102 సినిమా ప‌నుల్లో బిజీగా ఉన్నారు. వచ్చేనెల్లో 103 మొద‌ల‌వుతుంది. మొన్నామ‌ధ్య పైసా వసూల్ ఆడియో వేడుక‌లో చెప్పిన‌ట్టు బాల‌య్య ఇప్పుడు ఫ్రెష్ ఇన్నింగ్స్ మొద‌లుపెట్టినంత స్పీడ్ మీద ఉండ‌టం ఆయ‌న అభిమానుల్లో గ‌ర్వాతిశ‌యాన్ని ఉప్పొంగిస్తోంది.

More News

మ‌రో వార‌సుడి ఎంట్రీ

ఇప్పుడు అంత‌గా చెప్పుకోవ‌డం లేదు కానీ, నాలుగైదు ఏళ్ల క్రితం అంద‌రి నోటా వినిపించిన హీరో పేరు ర‌వితేజ‌. ఏడాదికి రెండు, మూడు సినిమాల‌తో ఇండ‌స్ట్రీ దృష్టిని ఆక‌ర్షించిన ర‌వితేజ ఈ మ‌ధ్య స్పీడు త‌గ్గించి కాస్త నిదానంగా స్క్రిప్ట్ ల‌ను ఎంపిక చేసుకుని న‌టిస్తున్నారు.

గాల్లో తేలుతున్న శ్రియ

గాల్లో తేలినట్టుందే..గుండె పేలినట్టుందే..అని హుషారుగా పాట పాడుకుంటోంది శ్రియ.

చరణ్ మూవీకి సంబంధించి ఆసక్తికరమైన ఫోటో...

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'రంగస్థలం 1985'.

హిందీలో 'అర్జున్ రెడ్డి'...

టాలీవుడ్ సినిమాలు ఇప్పుడు ఇండియా వైడ్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

రెండు వారాలు..ఎనిమిది సినిమాలు..

దసరాకి రెండు పెద్ద సినిమాలు పోటాపోటీగా విడుదలవుతుండడంతో..