బాలయ్యతో పూరి సినిమా..!

  • IndiaGlitz, [Thursday,October 27 2016]

డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఇజం చిత్రం ఇటీవ‌ల రిలీజైన విష‌యం తెలిసిందే. అయితే...పూరి త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో అనేది హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే...ఇజం త‌ర్వాత పూరి ఎన్టీఆర్ తో సినిమా చేస్తారు అంటూ వార్త‌లు వ‌చ్చాయి. పూరి ఎన్టీఆర్ కి క‌థ చెప్ప‌డం కూడా జ‌రిగింది కానీ...ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ల‌లా లేదు. దీంతో పూరి నెక్ట్స్ ఎవ‌రితో చేస్తాడు అనేది ఆస‌క్తిగా మారింది. ఇదిలా ఉంటే...పూరి నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి రోజుకో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌స్తుండ‌డంతో మ‌రింత ఇంట్ర‌స్ట్ పెరుగుతుంది. ఇజం చిత్రాన్ని బాలీవుడ్ లో స‌ల్మాన్ ఖాన్ తో రీమేక్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. గ‌తంలో స‌ల్మాన్ పూరి తెర‌కెక్కించిన పోకిరి చిత్రాన్ని వాంటెడ్ టైటిల్ తో రీమేక్ చేసారు. ఈసారి ఇజం చిత్రాన్ని స‌ల్మాన్ రీమేక్ చేయాల‌నుకుంటున్నారు.దాదాపు క‌న్ ఫ‌ర్మ్ అంటున్నారు.
అయితే...మ‌రో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ ఏమిటంటే...రామ్ గోపాల్ వ‌ర్మ స‌ర్కార్ 3 మూవీ చేస్తున్నారు. స‌ర్కార్ 3 సెట్ లో అమితాబ్ ను బాల‌య్య ఇటీవ‌ల క‌లిసారు. ఆ టైమ్ లో బాల‌య్య‌తో రామ్ గోపాల్ వ‌ర్మ పూరి ద‌గ్గ‌ర దేశ‌భ‌క్తికి సంబంధించిన ఓ క‌థ ఉంద‌ని చెప్పాడ‌ట. దీంతో బాల‌య్య ఆ క‌థ‌ను విన‌డం కోసం పూరికి క‌బురు పంపార‌నేది లేటెస్ట్ న్యూస్. అయితే...పూరి మ‌హేష్ తో జ‌న‌గ‌ణ‌మ‌న అనే సినిమా తీయాలి అనుకున్నారు. కానీ...మ‌హేష్ నుంచి పిలుపు రాక‌పోవ‌డంతో ఆ క‌థ‌నే బాల‌య్య‌తో కొన్ని మార్పులుతో పూరి చేయ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి...ఈ ప్ర‌చారంలో ఎంత వ‌ర‌కు నిజం ఉందో..? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..!