'నిశ్శబ్దం' టీజర్‌ను విడుదల చేసిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్
Send us your feedback to audioarticles@vaarta.com
`అరుంధతి`, `బాహుబలి`, `రుద్రమదేవి`, `భాగమతి` వంటి సూపర్‌హిట్ చిత్రాలతో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం `నిశ్శబ్దం`. ఈ చిత్రంలో అనుష్క మాట్లాడలేని సాక్షి అనే అమ్మాయి పాత్రలో నటిస్తున్నారు. గురువారం(నవంబర్ 7న) అనుష్క పుట్టినరోజుఈ సందర్భంగా `నిశ్శబ్దం` టీజర్‌ను విడుదల చేశారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలుగు టీజర్‌ను విడుదల చేశారు. తమిళం, మలయాళ టీజర్స్‌ను ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ విడుదల చేయగా.. హిందీ టీజర్‌ను స్టార్ డైరెక్టర్ నీరజ్ పాండే విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ప్రీ టీజర్ సినిమాపై అంచనాలను పెంచగా.. ఇప్పుడు విడుదలైన టీజర్ ఈ అంచనాలను రెట్టింపు చేసింది.
తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందుతోన్న ఈ క్రాస్ ఓవర్ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించనుంది. ఈ చిత్రంలో మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజ్, శ్రీనివాస్ అవసరాల , మైకేల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇందులో మాధవన్, అంజలి లుక్స్‌ను చిత్ర యూనిట్ రీసెంట్‌గా విడుదల చేసింది.
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్స్‌పై టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అనుష్క శెట్టి, ఆర్.మాధవన్, అంజలి, మైఖేల్ మ్యాడసన్, షాలిని పాండే, సుబ్బరాజు, శ్రీనివాస అవసరాల, హంటర్ ఓ హరో మెయిన్ రోల్స్ పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: చాడ్ రాప్టోర్, స్టైలీష్ట్: నీరజ కోన, స్టంట్స్: ఆలెక్స్ టెర్జీఫ్, సినిమాటోగ్రఫీ: షానియల్ డియో, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: కోన వెంకట్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల; నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్, స్టోరీ, డైరెక్షన్ - హేమంత్ మధుకర్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments