'అనగనగా ఓ ప్రేమకథ' తొలి పాట విడుదల చేసిన పూరి జగన్నాధ్
Send us your feedback to audioarticles@vaarta.com
విరాజ్.జె .అశ్విన్ హీరో గా పరిచయం అవుతూ అనగనగా ఓ ప్రేమకథ'' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి విదితమే. కె.సతీష్ కుమార్ సమర్పణలో టి.ప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాయికలుగా రిద్ధి కుమార్ ,రాధా బంగారు నటిస్తున్నారు. సినిమా రంగంలో ప్రముఖ ఫైనాన్షియర్ గా పేరుపొందిన నిర్మాత కె.ఎల్.యన్.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సాంగ్ "నిన్ను విడవను లే " డాషింగ్ డైరెక్టర్ " పూరి జగన్నాధ్ " విడుదల చేసారు.
డైరెక్టర్ పూరి జగన్నాధ్ మాట్లాడుతూ " ప్రొడ్యూసర్ కె.ఎల్.యన్.రాజు గారితో " అమ్మ నాన్న తమిళ్ అమ్మాయి " కి పని చేశాను మళ్ళీ అయన తో సినిమా చేయాలనుకున్న కానీ రాజు గారు ఇతర బిజినెస్ లలో లో బిజీ అయి పోయారు. మళ్ళీ చాల రోజులు తరవాత 'అనగనగ ఓ ప్రేమకథ' అనే సినిమా ని నిర్మించారు నాకు చాల ఆనందంగా ఉంది.
మార్తండ్ కే వెంకటేష్ గారి మేనల్లుడు అయిన విరాజ్ అశ్విన్ హీరో గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు , మార్తండ్ కే వెంకటేష్ గారి తో నేను చాల సినిమాలు పని చేశాను , తప్పకుండా విరాజ్ అశ్విన్ మంచి హీరో అవుతాడు అని నమ్మకం ఉంది . డైరెక్టర్ ప్రతాప్ కి బెస్ట్ విషెస్ చెపుతూ , ఈ సినిమా ని హిట్ ఇవ్వాలి అని కోరుకుంటున్న " అని మాట్లాడారు .
తమ చిత్రం తొలి పాటను ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ విడుదల చేయటం పట్ల చిత్ర నిర్మాత సంతోషాన్ని వ్యక్తం చేసి కృతఙ్ఞతలు తెలిపారు. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపు కుంటోంది. అక్టోబర్ నెలలో విడుదల చేయటానికి సిద్ధం చేస్తున్నాము అని తెలిపారు.
ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు (తిళ్ళు) తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, పాటలు:శ్రీమణి, కెమెరా: ఎదురొలు రాజు, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్: రామాంజనేయులు, నృత్యాలు: అనీష్, పోరాటాలు:రామకృష్ణ నిర్మాత: కె.ఎల్.ఎన్.రాజు కధ,స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం: ప్రతాప్ తాతంశెట్టి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments