పూరి-కళ్యాణ్ రామ్ మూవీ లేటెస్ట్ న్యూస్..
Thursday, March 17, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
డేరింగ్ & డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఓ చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్ర్కిప్ట్ వర్క్ జరుగుతుంది. మే మొదటివారంలో ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన నటించే హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు. కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంలో హీరోయిన్ గా నటించిన మెహరీన్ అయితే బాగుంటుందని చిత్రయూనిట్ భావిస్తోంది. అలాగే ఈ చిత్రానికి రీమీక్స్ అనే టైటిల్ అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ...ఈ సినిమాకి రీమిక్స్ టైటిల్ కాదని..తెలుగు టైటిలే పెట్టాలనుకుంటున్నారని సమాచారం. మే మొదటివారంలో ప్రారంభించే ఈ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments