పూరి ఇజం రన్ టైమ్..!
Friday, October 14, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
డేరింగ్ హీరో కళ్యాణ్ రామ్ - డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇజం. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించారు. కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ జర్నలిస్ట్ గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్ర పోషించారు. సినిమాను ఫాస్ట్ గా తీయడమే కాదు...కథను కూడా అంతే స్పీడుగా పరిగెత్తిస్తాడు పూరి.
ఇక ఇజం సినిమాను కూడా అంతే స్పీడులో నెరేట్ చేసాడట. ఇదిలా ఉంటే...ఇజం రన్ టైమ్ 2 గంటల 8 నిమిషాలట. ఇప్పుడొస్తున్న కమర్షియల్ సినిమాలకు ఇది తక్కువ రన్ టైమే. దీనికి తోడు క్లైమాక్స్ చాలా బాగుంది అని సెన్సార్ టాక్ బయటకు రావడంతో ఇజం విజయం ఖాయం అని ప్రచారం జరుగుతుంది. ఈ భారీ ఇజం చిత్రాన్ని ఈనెల 21న రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments