కొరటాల శివకు పోటీగా పూరి జగన్నాథ్..
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం జనతా గ్యారేజ్. ఈ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా కొరటాల శివ జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ ను ఈ నెల 19న రిలీజ్ చేయనున్నారని సమాచారం.
ఇదిలా ఉంటే...కళ్యాణ్ రామ్ తో సినిమా చేస్తున్న డేరింగ్ & డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ త్వరలో ఎన్టీఆర్ తో కూడా సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా పూరి జగన్నాథ్ కూడా ఎన్టీఆర్ తో చేయనున్న మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారట. ఈ చిత్రానికి నేతాజీ అనే టైటిల్ అనుకుంటున్నట్టు ప్రచారంలో ఉంది. మరి...ఎన్టీఆర్ కి పూరి ఇచ్చే బర్త్ డే గిఫ్ట్ ఎలా ఉంటుందో..? చూద్దాం..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com