కొత్తగా పూరి...
Send us your feedback to audioarticles@vaarta.com
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు ఇప్పుడు సరైన హిట్ లేదు. ఎలాగైనా ఓ మంచి హిట్ కొట్టాలని ఆశగా వెయిట్ చేస్తున్నాడు. అందులో భాగంగా తన తనయుడు ఆకాష్ పూరితో తన స్వంత నిర్మాణంలో 'మెహబూబా' అనే సినిమాను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. 1971లో జరిగిన ఇండో పాక్ నేపథ్యంలో సినిమా సాగుతుంది.
అయితే ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో సాగుతుందని ఫిలింనగర్ టాక్. తెలుగులో పునర్జన్మల నేపథ్యంలో వచ్చిన సినిమాలన్నీ పెద్ద సక్సెస్‌లయ్యాయి. కెరీర్ స్టార్టింగ్‌లో విభిన్నమైన సినిమాలు చేసిన పూరి డ్రగ్స్, మాఫియా సినిమాలు, యారగెంట్ హీరోల సినిమాలు చేయడానికే ఆసక్తి చూపాడు. అయితే ఈ సారి లైన్ మార్చి పునర్జన్మల కాన్సెప్ట్ లవ్‌స్టోరీ చేయడం అంటే కాస్త కొత్తగానే ఉంది మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments