జాక్స్‌ను చాలా బాధపెట్టా.. వాడు ఇకలేడు: పూరీ
Send us your feedback to audioarticles@vaarta.com
మనం ఎంతో ముద్దుగా పెంచుకునే పెంపుడు జంతువులు, పక్షులు చనిపోతే ఆ బాధ మాటల్లో చెప్పలేం. పెంపుడు కుక్క అంటే అందరికీ ఇష్టమే. చిన్న పిల్లప్పటి నుంచి దాన్ని పెంచి పోషించి కుటుంబంలో ఒక్కరుగా భావించి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న అదే కుక్క చనిపోతే కుటుంబంలో సభ్యుడ్ని కోల్పోయినంత బాధ ఉంటుంది.! అలాంటి ఘటనే టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇంట్లో చోటుచేసుకుంది. తన ఇంట్లో ఎనిమిదేళ్లుగా ఉంటున్న కుక్క చనిపోవడంతో ఆ కుటుంబం కన్నీరుపెట్టుకుంది!. పూరీ జగన్ తన బాధను ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ రూపంలో తెలిపారు.
పూరీ ట్వీట్ సారాంశం..
" వీడి పేరు జాక్స్. ఎప్పుడూ నాతోనే ఉండేది. ఒకానొక టైమ్‌లో వీడిని పెంచే పరిస్థితి లేక ఫ్రెండ్‌కు ఇచ్చేశాను. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఇంటికి తీసుకొచ్చాను. కానీ వాడు హర్ట్ అయ్యి అప్పట్నుంచి నాతో మాట్లాడటం మానేశాడు. నా దగ్గరికి రాడు.. నా వైపు చూడడు. తోక కూడా ఊపి ఇప్పటికి 8 సంవత్సరాలు అయ్యింది.
నేను లైఫ్‌లో ఎంతో బాధపెట్టానో నాకు తెలియదు కానీ వీడిని మాత్రం చాలా బాధపెట్టాను. వాడు ఇంక లేడు. నేడు వాడికి చివరి రోజు" అని బాధతో పూరీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో పాటు ఒకప్పటి జాక్స్ ఫొటో.. మృతి చెందిన తర్వాత పూలదండలతో ఉన్న జాక్స్ ఫొటోను జత చేశాడు. పూరీ ట్వీట్‌కు ఆయన అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments