'రోగ్' సినిమా కంటే హీరో ఇషాన్ నన్ను ఎగ్జయిట్ చేశాడు: పూరి జగన్నాథ్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ హీరో ఇషాన్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్ పతాకంపై డా|| సి.ఆర్.మనోహర్, సి.ఆర్.గోపి నిర్మిస్తున్న డిఫరెంట్ లవ్ స్టోరీ 'రోగ్'(మరో చంటిగాడి ప్రేమకథ). ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు.
ఈ సందర్బంగా...
భాస్కరభట్ల మాట్లాడుతూ - ``పూరిగారి చేతిలో హీరో పడితే ఎంత మాస్ హీరో అవుతాడో అందరికీ తెలుసు. ఇషాన్ కూడా అలాగే పెద్ద హీరో అవుతాడు. సునీల్ కశ్యప్ చాలా మంచి సంగీతాన్నిచ్చాడు`` అన్నారు.
సునీల్ కశ్యప్ మాట్లాడుతూ - ``పూరిగారితో సినిమా చేయడం బ్యూటీఫుల్ జర్నీ. ఇషాన్‌ను పూరిగారు ఎంత ప్రేమించి ఈ సినిమా చేశారో నాకు తెలుసు. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన పూరిగారు, నిర్మాత మనోహర్గారికి థాంక్స్. మరో చంటిగాడి ప్రేమ కథ. అందరూ ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది`` అన్నారు.
అలీ మాట్లాడుతూ - ``నా సోదరుడు, దర్శకుడు పూరిగారితో చేసిన సినిమా ఇది. డిఫరెంట్‌గా ఎలా చేస్తే సినిమా ప్రేక్షకులకు ఎలా నచ్చుతుందో తెలిసిన దర్శకుడు పూరి. అచ్చ తెలుగు అబ్బాయి ఇషాన్‌ను ఈ సినిమాలో పూరి చాలా బాగా ప్రెజెంట్ చేశారు. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది`` అన్నారు.
నిర్మా సి.ఆర్.మనోహర్ మాట్లాడుతూ - ``వైజాగ్‌లో సత్యానంద్‌గారి వద్ద ట్రయినింగ్లో ఉన్న ఇషాన్ ఫోటోస్ చూసిన పూరిగారు, ఇషాన్‌ను ఒకసారి డైరెక్ట్ చూస్తానని అనడంతో, నేను ఇషాన్‌ను పూరిగారి వద్దకు తీసుకెళ్ళాను. ఇషాన్‌ను చూసిన పూరిగారు..సార్ సాయంత్రం వచ్చేయండి స్టోరీ చెబుతాను అని అన్నాడు. ఆయన ఇంట్రడ్యూస్ చేసిన ప్రతి హీరో నిలబడతారని నమ్మకం ఉంది. ఆయనలాంటి దర్శకుడుతో ఇషాన్‌తో సినిమా చేస్తానని అనడంతో చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఇషాన్ మా బాబాయ్ కొడుకు, అంటే నాకు తమ్ముడు. ఇషాన్‌ను తమ్ముడులా కాకుండా బిడ్డలా చూసుకున్నాం. సినిమా చేసేటప్పుడు ఇషాన్ మీ తమ్ముడు కాడు..నా బిడ్డలా చూసుకుంటాం అని పూరిగారు చెప్పిన మాటను మరచిపోలేను. ఇషాన్ పూరిగారు వారింటి అబ్బాయిలా చూసుకుని సినిమా చేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో నేను ఎలక్షన్స్‌లో బిజీగా ఉన్నాను. పూరిగారు ఫస్ట్ షెడ్యూల్ కాగానే ఇషాన్ బంగారం..తనతో మూడు సినిమాలు చేయాలని అన్నారు. హిందీలో కూడా ఇషాన్‌తో సినిమా చేస్తానని అనడం ఎంతో ఆనందంగా ఉంది. సినిమాను ఇప్పటికే నాలుగుసార్లు చూశాను. ఇషాన్‌ను చక్కగా చూపించారు`` అన్నారు.
పూరి జగన్నాథ్ మాట్లాడుతూ - ``నేను రోగ్ కథ కంటే హీరోను చూడగానే ఎగ్జయిట్ అయ్యాను. హీరో లక్షణాలన్నీ ఉన్న హీరో. మనోహర్ వంటి బ్రదర్ ఉండటం ఇషాన్ అదృష్టం. ఇషాన్ చాలా పెద్ద స్టార్ అవబోతున్నాడు..అవుతాడని నాకున్న ఎక్స్‌పీరియెన్స్‌తో చెబుతున్నాను. ఈవాళ వీకిపీడియాలో ఇషాన్ పేరు లేకపోవచ్చు కానీ..త్వరలోనే సౌతిండియాలో పెద్ద స్టార్ ఇషాన్ అని గూగుల్ చూపిస్తుంది. శ్రీదేవి వంటి స్టార్‌ను రాఘవేంద్రగారు ఇంటడ్ర్యూస్ చేసినప్పుడు రాఘవేంద్రరావుగారు ఎంత హ్యాపీగా ఫీలయ్యారో, అలాగే ఇషాన్‌ను ఇంట్రడ్యూస్ చేసినందుకు నేను హ్యాపీగా ఫీలవుతున్నాను. సినిమా చాలా బాగా నచ్చింది. సినిమా చూసిన వారందరికీ సినిమా బాగా నచ్చింది. ఎంజెలినా, మన్నారా, అనూప్ సింగ్ చక్కగా నటించారు. సునీల్ కశ్యఫ్ అద్భుతమైన సాంగ్స్ ఇచ్చాడు. ఇషాన్ పెద్ద స్టార్ అవుతాడు`` అన్నారు.
హీరో ఇషాన్ మాట్లాడుతూ - ``మా తల్లిదండ్రులు, మా ఫ్యామిలీ, మా పెద్దనాన్న ఎంకరేజ్ మెంట్‌తోనే నేను హీరోగా ఇక్కడ నిలబడి ఉన్నాను. నాకు నా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. పూరిగారితో రోగ్ సినిమా చేసేటప్పుడు నా ఫ్యామిలీ లోటును తీర్చారు. నాకు మరో ఫ్యామిలీలా అండగా నిలబడ్డారు. మనోహర్ అన్నయ్యనే ఈరోజు రియల్ హీరో. ఆయన అసలు రోగ్ హీరో. ఆయన వల్లే నేను హీరోగా నిలబడ్డాను. నేను ఇండస్ట్రీకి రాకపోయుంటే పూరిగారి ఫ్యామిలీ వంటి మంచి ఫ్యామిలీని మిస్ అయ్యేవాడిని. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. ముఖేష్‌గారు నన్నెంతో అందంగా చూపించారు. అలీ, పోసాని వంటి సీనియర్ యాక్టర్స్‌తో ఫస్ట్ సినిమా చేయడం ఆనందంగా ఉంది. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.
ఎంజెలా మాట్లాడుతూ - ``పూరిగారి వంటి స్టార్ డైరెక్టర్‌తో పనిచేయడం కల నిజమైనట్లు అనిపించింది. ఇషాన్ వంటి కోస్టార్‌తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ఇషాన్ డెఫనెట్‌గా పెద్ద స్టార్ అవుతాడు`` అన్నారు.
మన్నారా చోప్రా మాట్లాడుతూ - ``రోగ్ సినిమా చేయడంతో ఎగ్జయిటింగ్‌గా ఫీలవుతున్నాను. నేను ఈ సినిమాలో యాక్ట్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇషాన్‌తో సహా అందరికీ మంచి పేరు తెచ్చే చిత్రమవుతుందని భావిస్తున్నాను`` అన్నారు.
ఇషాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మన్నారా చోప్రా, ఏంజెలా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అనూప్‌సింగ్, ఆజాద్ ఖాన్, పోసాని కృష్ణమురళి, అలీ, సత్యదేవ్, సుబ్బరాజ్, రాహుల్ సింగ్, తులసి, రాజేశ్వరి, సందీప్తి తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: బి.రవికుమార్, ఆర్ట్: జానీ షేక్, ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ, మ్యూజిక్: సునీల్‌కశ్యప్, సినిమాటోగ్రఫీ: ముఖేష్.జి, నిర్మాతలు: సి.ఆర్.మనోహర్, సి.ఆర్.గోపి, దర్శకత్వం: పూరి జగన్నాథ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout