అదే లోఫర్ సక్సెస్ అంటున్న పూరి
Send us your feedback to audioarticles@vaarta.com
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్..తెరకెక్కించిన తాజా చిత్రం లోఫర్. ఈ చిత్రంలో నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, దిషా పటాని జంటగా నటించారు. సి.కళ్యాణ్ ఈ మూవీని నిర్మించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లోఫర్ ఆడియో వేడుకకు ముఖ్యఅతిధిగా హాజరయి.. ఆడియో రిలీజ్ చేసారు. ఈ వేడుకలో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ...అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా తర్వాత మళ్లీ ఇప్పుడు మదర్ సెంటిమెంట్ తో మూవీ తీసాను.
అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా టైంలో వర్మ గారు ఏ సినిమా చేస్తున్నావ్ అని అడిగితే...చెప్పాను. అప్పుడు ఆయన..అమ్మ, నాన్న, మావయ్య...ఈ సెంటిమెంట్స తో సినిమాలు ఎలా తీస్తారయ్యా అన్నారు. అదే వర్మ గారు లోఫర్ మూవీ చూసి ఈ సినిమాకి మా అమ్మ మహాలక్ష్మి అనే టైటిల్ పెట్టు అన్నారు. అదే లోఫర్ సక్సెస్ గా భావిస్తున్నాను అన్నారు పూరి. మరి...వర్మకి నచ్చిన లోఫర్ ఆడియోన్స్ కి నచ్చుతుందో లేదో తెలియాలంటే ఈ నెల 18 వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com