పూరి పై దాడి - పి.ఎస్ లో ఫిర్యాదు..
Send us your feedback to audioarticles@vaarta.com
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ - మెగా హీరో వరుణ్ తేజ్ తో తెరకెక్కించిన చిత్రం లోఫర్. ఈ చిత్రం ఆశించిన స్ధాయిలో విజయం సాధించలేదు. దీంతో లోఫర్ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ధికంగా బాగా నష్టపోయారు. అయితే లోఫర్ సినిమా వలన నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ రోగ్ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మాకే ఇవ్వాలంటూ ఇంటికి వెళ్లి పూరి జగన్నాథ్ పై దాడి చేసారట.
రోగ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇవ్వకపోతే సినిమాను అడ్డుకుంటామన్నారట. దీంతో పూరి జగన్నాథ్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో తనపై ముగ్గురు డిస్ట్రిబ్యూటర్స్ దాడి చేసినట్లు ఫిర్యాదు చేసారు. పూరి ఫిర్యాదు తో పోలీసులు 386, 452, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments