Puri Jagannadh:మరోసారి ‘‘ఇస్మార్ట్ శంకర్’’ కాంబినేషన్ రిపీట్.. రేపు ధీమాక్ ఖరాబ్ అనౌన్స్మెంట్, చార్మికి మళ్లీ ఆ బాధ్యతలు
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్లో ఒకప్పుడు డాషింగ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు పూరి జగన్నాథ్. యువతకు , నేటి తరానికి తగిన విధంగా సినిమాలు తీస్తారని ఆయన గుర్తింపు వుంది. అయితే అలాంటి దర్శకుడు వరుస ఫ్లాప్‌లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో పూరి కెరీర్‌ను నిలబెట్టిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’’. రామ్ పోతినేని హీరోగా నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. రామ్ నటన, పాటలు, డ్యాన్స్‌లు, ఫైట్స్, పూరి టేకింగ్‌కు జనం ఫిదా అయ్యారు. అంతేకాదు.. చాక్లెట్ బాయ్‌లా వుండే రామ్‌ను పూర్తిగా మేకోవర్ చేశారు పూరి. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.80 కోట్ల వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.
రేపు ఎలాంటి అప్డేట్ ఇస్తారో :
ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్ అధికారికంగా తెలియజేసింది. ఈ మేరకు రేపు సాయంత్రం 4 గంటలకు ‘‘ధీమాక్ ఖరాబ్ అనౌన్స్మెంట్’’ చేస్తామని తెలిపింది. రామ్ , పూరి కాంబోలో వస్తున్న రెండో సినిమా కూడా ఇస్మార్ట్ శంకర్ తరహాలో పక్కా కమర్షియల్‌గా వుంటుందని సినీ జనాలు భావిస్తున్నారు. అయితే అది ఇస్మార్ట్ శంకర్ 2నా లేక మరేదైనా ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో వస్తారా అన్నది తెలియాల్సి వుంది.
పూరి, ఛార్మీల కెరీర్‌కు ఓ హిట్ కావాల్సిందే :
విజయ్ దేవరకొండతో తీసిన పాన్ ఇండియా మూవీ ‘‘లైగర్’’ ఫ్లాప్ తర్వాత పూరి జగన్నాథ్ .. రామ్ సినిమా కోసం స్క్రిప్ట్ రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. యూత్‌కి నచ్చే విధంగా అన్ని రకాల ఎలిమెంట్స్‌ను ఇందులో సిద్ధం చేసినట్లుగా సమాచారం. అటు సినీ నటి ఛార్మీ మరోసారి సహ నిర్మాత పాత్ర పోషించేందుకు రెడీ అయ్యారు. లైగర్ నష్టాల నుంచి కోలుకునేందుకు పూరి, చార్మీలకు .. వారి కెరీర్లకు రామ్ సినిమా కీలకం కానుంది. అటు రామ్ పోతినేని విషయానికి వస్తే.. ఆయన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
The combo that gave Ismart Blockbuster🔥
— Charmme Kaur (@Charmmeofficial) May 13, 2023
After 4 years, Ustaad @ramsayz & Sensational Director #PuriJagannadh join forces again❤️🔥
Produced by PuriJagannadh & Me in @PuriConnects
A Dhimak Kharab Announcement Striking Tomorrow at 4 PM 💥
Stay HYPED 🔱 pic.twitter.com/6dfdTDnJXv
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments