పూరీ.. పదేళ్ళ తరువాత
Send us your feedback to audioarticles@vaarta.com
పూరీ జగన్నాథ్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని దర్శకుడి పేరిది. ఎన్నో సంచలన విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఈ దర్శకుడు.. ఇటీవల కాలంలో రేసులో కాస్త వెనుకపడ్డారు. ప్రస్తుతం తన తనయుడు పూరీ ఆకాశ్ హీరోగా 'మెహబూబా' సినిమాని రూపొందిస్తున్నారు. 1971 ఇండో - పాక్ వార్ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ డ్రామా మే 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే.. బద్రి, అమ్మనాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి.. ఇలా ఎన్నో విజయాలను వేసవి సీజన్లో అందుకున్నారు పూరీ. అయితే.. ఎటొచ్చి మే నెలలో పూరీ నుంచి వచ్చిన చిత్రాలేవీ విజయం సాధించిన దాఖలాలు లేవు. బుజ్జిగాడు, గోలీమార్, ఇద్దరమ్మాయిలతో.. ఇలా మే నెలలో వచ్చిన పూరీ సినిమాలన్నీ ఘోరంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో.. మెహబూబా కూడా అదే బాటలో వెళుతుందో లేదంటే.. ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి ఘనవిజయం సాధిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments