'నెపొటిజం' గురించి పూరి ఏమన్నారంటే...
Send us your feedback to audioarticles@vaarta.com
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పలు విషయాలపై 'పూరీ మ్యూజింగ్స్' పేరుతో స్పందిస్తున్నారు. ఇప్పటికే చాలా విషయాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించిన పూరి తాజాగా మరో ఆసక్తికరమైన విషయం గురించి స్పందించారు. ఆ అంశమే 'నెపొటిజం'..అచ్చ తెలుగులో చెప్పాలంటే బంధుప్రీతి. పలు రంగాల్లో తమ పిల్లలు, బంధువులు తదితరులను మాత్రమే ఎంకరేజ్ చేసే పరిస్థితినే బంధుప్రీతి అంటారు. ఎప్పటి నుండో సినీ రంగంలో నెపొటిజం ఎక్కువగా ఉందనే వార్తలను చూస్తూనే ఉంటాం. ఈ నెపొటిజం గురించి ఇంతకూ పూరి ఏమన్నారంటే.."నిజానికి బంధుప్రీతి అనేది మనందరి రక్తంలో ఉంటుంది. ఒక జాతి పక్షులన్నీ ఒకచోటే చేరుతాయి. ఒక వీధిలో కుక్కలన్నీ కలిసి కట్టుగా ఉంటాయి. దీన్నే బంధుప్రీతి అంటారు.
ఉదాహరణకు మీ అమ్మ ఆకలితో ఉన్న నీకు రొట్టె తినిపిస్తుందని అనుకుందాం. ఆమె స్నేహితురాలి బిడ్డ వస్తే అతనికి కొంచెం పెడుతుంది. అదే ఆ వీధిలో అడక్కునే పిల్లాడు వస్తే అతడెక్కడ రొట్టె లాక్కుని వెళ్లిపోతాడేమోనని ఇంట్లోకి తీసుకెళ్లి తలుపేసుకుంటుంది. రొట్టెముక్క ఎక్కడ ఉంటే అక్కడకి అందరూ చేరుతారు. కోట్ల ఆస్థి ఉన్న మీ నాన్న దాన్ని నీకు రాయడమెందుకు నాకు రాయరెందుకు? మానాన్న అప్పుల్ని నువ్వు తీర్చవచ్చుగా.. దరిద్రాన్ని ఎవరూ పంచుకోరు. బంధుప్రీతి సినిమా ఇండస్ట్రీలోనే ఉందా? రాజకీయాల్లో లేదా? అయోధ్యను రాముడి చేతిలోనే పెడతారు. లయన్ కింగ్‌లో హీరో సింబానే. ఈ పిల్లలు నెపోకిడ్స్ కావడానికి కష్టపడు. అంతకు మించి కావాల్సినదేముంది. బంధుప్రీతి గురించి అరుస్తూ సక్సెస్‌ఫుల్ అయిన వారికి దూరం కావద్దు. ఏ తండ్రి తన పిల్లలకు సక్సెస్‌ను కొనివ్వలేడు. సక్సెస్ సాధించడానికి కావాల్సింది నైపుణ్యం మాత్రమే. పిక్కల్లో బలం ఉన్నవాడిని ఎవరూ ఆపలేరు" అంటూ బంధు ప్రీతి గురించి చెప్పారు పూరీ జగన్నాథ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments