ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణం.. మార్కెట్లోకి విడుదలైన ప్యూర్ EV ఈప్లూటో 7G మ్యాక్స్

  • IndiaGlitz, [Friday,October 06 2023]

ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో దూసుకుపోతున్న ప్యూర్ ఈవీ సంస్థ కొత్తగా ఈప్లూటో 7G మ్యాక్స్ స్కూటీని విడుదల చేసింది. ఎన్నో ప్రత్యేకతలతో ఈ స్కూటీ మార్కెట్లోకి రిలీజ్ అయినట్లు కంపెనీ చెబుతోంది. కేవలం ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 201 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందని వెల్లడించింది. రెట్రో-థీమ్‌తో వస్తున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.14లక్షలుగా పేర్కొంది. హిల్-స్టార్ట్ అసిస్ట్, డౌన్‌హిల్ అసిస్ట్, కోస్టింగ్ రీజెన్, రివర్స్ మోడ్ వంటి ప్రత్యేకలు ఉన్నట్లు తెలిపింది. ఎలక్ట్రిక్ మోటార్‌ కనెక్ట్ చేయ‌టంతో సరికొత్త రైడింగ్ అనుభూతి ఇస్తుందని చెప్పింది.

ముందుగా బుక్ చేసుకున్న వారికి అందుబాటులోకి..

మ్యాట్ బ్లాక్, రెడ్, గ్రే, వైట్ రంగుల్లో ఈ స్కూటీ అందుబాటులో ఉండనుంది. ఇప్పటికే భారత్ వ్యాప్తంగా ఈ స్కూటర్ బుకింగ్స్ ఓపెన్ చేసింది కంపెనీ. పండుగ సీజన్‌లో విడుదల చేస్తున్న నేపథ్యంలో ఈ స్కూటర్‌కు గిరాకీ ఎక్కువగా ఉంటుందని.. అందుకే ముందుగా బుక్ చేసుకున్న వారికి స్కూటర్ అందజేస్తామంది. ఈ స్కూట‌ర్‌కి క‌నెక్ట్ చేసిన ఎలక్ట్రిక్ మోటార్‌కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన AIS-156-సర్టిఫైడ్ 3.5 kWh లిథియం- అయాన్ స్మార్ట్ బ్యాటరీ అమర్చడం వల్ల 3.21bhp మేర‌ అత్యధిక‌ శక్తినందిస్తుంది. దీంతో ఈ స్కూట‌ర్ మ‌రింత మెరుగ్గా భార‌త్ ర‌హ‌దారుల‌పై రయ్ రయ్‌మంటూ దూసుకెళ్లడం ఖాయంగా చెబుతున్నారు కంపెనీ నిర్వాహ‌కులు.

60వేల కిలోమీటర్ల వారంటీ..

అలాగే రైడింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ మరింత పెంచ‌డానికి మొత్తం మూడు రకాల రైడింగ్ మోడ్‌లు అందిస్తున్నామని తెలిపారు. రోజుకు కనీసం 100 కిలోమీటర్లు ప్రయాణించే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఈ స్కూటర్ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు ఈ EV స్కూటర్‌కి 60వేల‌ కిలోమీటర్ల వారంటీ కూడా అందిస్తున్నారు. అలాగే 70వేల‌ కిలోమీటర్ల వారంటీ కూడా అందుబాటులో ఉందని నిర్వాహకులు చెబుతున్నారు.

More News

VH Hanumantha Rao: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌ను మోసం చేయబోయిన సైబర్ నేరగాళ్లు

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. డిజిటల్ లావాదేవీలు పెరగడంతో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు కుచ్చుటోపీ పెడుతున్నారు.

Nara Lokesh: జైల్లో చంద్రబాబుపై భద్రతపై ఆందోళనగా ఉంది: లోకేశ్

జైల్లో చంద్రబాబు భద్రతపై తమకు ఆందోళనగా ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. జైలుపై దాడి చేస్తామని కొందరు లేఖ రాశారని..

Nobel Peace Prize: జైలులో మగ్గుతున్న మానవ హక్కుల కార్యకర్తకు నోబెల్ శాంతి బహుమతి

2023 సంవత్సరానికి గానూ వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి నోబెల్ బహుమతులు ప్రకటిస్తు్న్న సంగతి తెలిసిందే. ఇప్పటికై వైద్యశాస్త్రం, భౌతిక శాస్త్రం

సహనం కోల్పోయిన మహమూద్ అలీ.. గన్‌మెన్ చెంప చెల్లుమనిపించిన హోంమంత్రి

ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ మంత్రులు బహిరంగంగా ప్రవర్తిస్తు్న్న తీరు వివాదాస్పదమవుతోంది. తోటి ప్రజాప్రతినిధులతో పాటు అధికారుల పట్ల వారి ప్రవర్తన తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

Kodali Nani: పవన్ మొరిగే కుక్క తప్ప కరిచే కుక్క కాదు... కొడాలి నాని ఘాటు విమర్శలు

వారాహి యాత్ర సభలో వైసీపీ ప్రభుత్వం రూపాయి పావలా ప్రభుత్వం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో స్పందించారు.