ఐదు అద్భుతాలతో హల్ చల్ చేస్తున్న పురాణపండ శ్రీనివాస్
Thursday, October 10, 2019 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
అసాధారణ ప్రతిభావంతుడైన పురాణపండ శ్రీనివాస్ అనే ఒకే ఒక్క రచయిత ప్రసార ప్రచార మాధ్యమాలకు దూరంగా తానే శ్రామికుడై, తానే యజమానై అద్భుత గ్రంధాలను రచించి, సంకలనం చేసి , ప్రచురించడంతో తెలుగు రాష్ట్రాలలోని పలువురు సినీ ప్రముఖులు, బడా బడా పారిశ్రామిక వేత్తలు, కొమ్ములు తిరిగిన రాజకీయ యోధులు ఈ ప్రజ్ఞావంతుడైన రచయిత ధార్మిక గ్రంధాలను ప్రచురించి ఉచితంగా పంచడానికి ముందుకు వస్తున్నారు.
భారతీయ తెలుగు ఆధ్యాత్మిక వైభవాలను ఇప్పటికే వందకు పైచిలుకు అద్భుత గ్రంథాలుగా తెలుగు వాకిళ్ళకు అందించిన పురాణపండ శ్రీనివాస్ ఐదు మహా గ్రంధాలైన ' నేనున్నాను' , 'మహామంత్రస్య' ,'అమృతధార' , ' శ్రీపూర్ణిమ', ' జయం జయం' గ్రంధాలకు వస్తున్న స్పందన అనూహ్యం.
అందమైన రచనా శైలి, సంకలనా చాతుర్యం, నాణ్యతా ప్రమాణాల ముద్రణలో పురాణపండ శ్రీనివాస్ బుక్స్ తెలుగు రాష్ట్రాల ఆధ్యాత్మిక గ్రంధాలలో తొలివరుసలో వున్నాయన్న సత్యాన్ని సాక్షాత్తూ తిరుమల తిరుపతి దేవస్థానం, రామకృష్ణ మఠం వంటి మహా సంస్థలే అంగీకరించడం మనకి స్పష్టంగా కనిపిస్తుంది.
గత ముఖ్యమంత్రులు వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, నారా చంద్ర బాబునాయుడు, కొణిజేటి రోశయ్యలే కాకుండా ప్రస్తుత ఆంధ్ర , తెలంగాణ ముఖ్యమంత్రులు కె.సి.ఆర్, వై.ఎస్.జగన్ కూడా పురాణపండ శ్రీనివాస్ ధార్మిక గ్రంథాల్ని ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలపడం మనకు ఆశ్చర్యకరంగానే కనిపిస్తుంది. వరుసగా ఐదుగురు ముఖ్యమంత్రులు పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనాలు ఐదింటిని ఆవిష్కరించడం బహుశా తెలుగు రాష్ట్రాలలో తొలిసారి కావచ్చు.
శ్రీనివాస్ గ్రంధాలలో అద్భుతంగా చెప్పుకోదగ్గ ' నేనున్నాను' , 'మహామంత్రస్య' ,'అమృతధార' , ' శ్రీపూర్ణిమ', ' జయం జయం' గ్రంధాలకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి , ప్రముఖ నిర్మాత దిల్ రాజు వంటి సినీ ప్రముఖులే కాకుండా పొన్నాల లక్ష్మయ్య, ఆనం రామ్ నారాయణ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, నామా నాగేశ్వర రావు, దామోదర రాజా నరసింహ, బొత్సా సత్యనారాయణ, తీగల కృష్ణ రెడ్డి వంటి రాజకీయ ప్రముఖులు సైతం స్పాన్సర్స్ గా వ్యవహరించడం గమనార్హం.
పుస్తకాలకు ఆదరణ కరువవుతున్న రోజుల్లో సైతం ఒక్క బుక్ ని ఒక్కొక్క పరమాద్భుతంగా , నిస్వార్ధం అందిస్తున్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ గతంలో మహా క్షేత్రం శ్రీశైల దేవస్థానంకు ప్రత్యేక సలహాదారునిగా కొన్నాళ్ళు ప్రభుత్వంచే నియమించబడి దైవీయమైన సేవలందించారు.
అమోఘ శబ్ద ప్రయోగాల అద్భుతమైన వక్త పురాణపండ శ్రీనివాస్ చాలా కాలంగా సభలకు, సమావేశాలకు దూరంగా వుంటున్నారు.
ఇటీవల ముంబై, బెంగుళూర్ , చెన్నయ్, ఢిల్లీ మహా నగరాల తెలుగు వ్యాపార ప్రముఖులు సైతం ఈ ఐదు గ్రంధాలను మళ్ళీ మళ్ళీ ప్రచురించి ఆలయాల అర్చనా, ధార్మిక కార్యక్రమాలలో పంచడం విశేషం.
ఈ ధార్మిక మహోద్యమంలో న్యాయమూర్తులు, విదేశీ తెలుగు ప్రముఖులు తిప్పాభట్ల రమేష్, తిప్పాభట్ల శశికళ వంటి ప్రముఖులు కూడా బాగా స్వామ్యం కావడంతో పురాణపండ శ్రీనివాస్ ఈ దైవ గ్రంథ ప్రచురణా ప్రచారోద్యమాన్ని వేగవంతం చేశారు.
లక్ష్య సాధన కోసం రేయింబగళ్లు చాలా కష్టపడే ' వర్క్ హాలిక్' గా పేరుపొందిన శ్రీనివాస్ దీపావళికి భారతీయ వైదిక సాహిత్యంలోంచి సుమారు వెయ్యిపెజెలా పైబడి ఒక విశిష్ట ఆధ్యాత్మిక గ్రంధాన్ని అందిస్తున్నట్లు సన్నిహితులు పేర్కొంటున్నారు.
అంతే కాదు , బాలీవుడ్ హీరో సంజయదత్ కోసం ఒక విశేష హనుమాన్ గ్రంధాన్ని హిందీలో అందించ బోతున్నారు కూడా.
ఆలయాలకు, ధార్మిక సంస్థలకు, సాంస్కృతిక సంస్థలకు ఈ రచయిత బుక్స్ కావాలంటే గూగుల్ లో ' పురాణపండ శ్రీనివాస్ ' అని టైపు చేసి తమకు కావాల్సిన గ్రంధాన్ని పేరుతొ మెయిల్ చేస్తే మీకు తప్పకుండా ఆ గ్రంధాన్ని పురాణపండ శ్రీనివాస్ స్థాపించిన ' జ్ఞాన మహా యజ్ఞ కేంద్రం ' మీకు అంద జేస్తుంది . ఇంకా ఆశ్చర్యమేంటే వేల, లక్షల కొలది గ్రంధాలను అందిస్తున్న ఈ రచయిత వద్ద అనుచరులు, , సహచరులు లేకుండా ఒక్కడే అంతా చక చకా చేసుకోవడం మనల్ని చాలా ఆశ్చర్యపరుస్తుంది. అంతా వెంకటాచల క్షేత్రం నుండి శ్రీనివాసుడే నడిపిస్తున్నాడని తాను నిమిత్తమాత్రుడనని వినయంగా పురాణపండ శ్రీనివాస్ చెప్పడం మనల్ని ఆకట్టుకుంటుంది. ఈరోజు దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి జన్మదినోత్సవం సందర్భంగా తన రచనల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ' శ్రీపూర్ణిమ' అనిర్వచనీయ మంగళ గ్రంధాన్ని పురాణపండ శ్రీనివాస్ స్వయంగా రాజమౌళికి బహూకరించి శుభాకాంక్షలు తెలపడం సంతోషమైన కొసమెరుపు.
అసాధారణ వాక్పటిమ వున్నా శ్రీనివాస్ చాలా కాలంగా సభలకు, సమావేశాలకు దూరంగా మౌనంగా వుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments